July 11, 2026

Shivalik LGP Tanker: గుజరాత్ చేరుకున్న ఎల్‌పీజీ ట్యాంకర్.. తీరనున్న గ్యాస్ కష్టాలు

Shivalik LGP Tanker: గుజరాత్ చేరుకున్న ఎల్‌పీజీ ట్యాంకర్.. తీరనున్న గ్యాస్ కష్టాలు
Reading Time: < 1 minute
Lpg Tanker Shivalik Reaches Mundra Port

పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత ‘శివాలిక్’ గ్యాస్ ట్యాంకర్ ఎట్టకేలకు అడ్డంకులు దాటుకుని గుజరాత్ ఓడరేవుకు చేరుకుంది. గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుకు చేరుకున్నట్లుగా అధికారులు తెలిపారు.

షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. శివాలిక్, నందా దేవి నౌకలు వరుసగా మార్చి 16, మార్చి 17 తేదీల్లో భారత్‌కు చేరుకుంటాయని తెలిపారు. అన్నట్లుగానే సోమవారం సాయంత్రం గుజరాత్ ఓడ రేవుకు శివాలిక్ చేరుకుంది. దీంతో భారత్‌లో గ్యాస్‌కు ఎలాంటి కొరత ఉండదు. ఈ నౌకలు దాదాపు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని తీసుకొస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Trump-Kharg Island: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను.. తాజా మాస్టర్ ప్లాన్ ఇదే!

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దౌత్యం మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇటీవల ఇరాన్ ప్రభుత్వ పెద్దలతో కీలక మంతనాలు జరిపారు. దీంతో భారత్ జెండాలు కలిగిన నౌకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మార్గం సుగమం చేశాయి. జలసంధిలో చిక్కుకున్న నౌకలు అన్నీ భారత్‌కు క్షేమంగా తిరిగి వస్తున్నాయి. నౌకలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అన్ని నౌకలు చేరుకుంటే మాత్రం గ్యాస్, చమురు కష్టాలు తీరినట్లే.

ఇది కూడా చదవండి: Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్