Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలోని ప్రై వేటు ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులను ఖరా రు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ అన్-ఎయిడెడ్ ప్రొఫెషనల్ ఇ నిస్టిట్యూషన్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ (బిఈ/బిటెక్) కోర్సులకు సంబంధించి న ఫీజులను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. విద్యాసంవత్సరం 2025 నుంచి 2026, 2027 నుంచి 2028 విద్యాసంవత్సరాలకు ఈ ఫీజులు వర్తిసాయని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. తెలంగాణ ఆడ్మిష న్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ గత ఏడాది 2025 అక్టోబర్‌లో ప్రభుత్వానికి సమర్పించిన సిఫారుసుల మేరకు ఇంజనీరింగ్ కోర్స్‌లకు ఈ ఫీజులు ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. రా ష్ట్రంలోని 160 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండ గా వీటిలో టాప్ 7 ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.లక్షా 50 వేల నుంచి అత్యధికంగా రూ. లక్షా 83 వేలుగా ఫీజులను ఖరారు చేసింది. అలాగే 27 ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.లక్షా నుంచి రూ.లక్షా 50 వేల వరకు, 107 కాలేజీలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు, 19 కాలేజీలకు రూ.50 వేలకు లోగా ఫీజులను ఖరారు చేసింది. రూ.లక్షా 50 నుంచి రూ.లక్షా 83 వేల వరకు ఉన్న కాలేజీలలో టాప్7లో చైతన్యభారతి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజిలో అత్యధికంగా రూ.లక్షా 83 వేలు,వాసవీ ఇంజనీరింగ్ కాలేజిలో రూ.లక్షా 75 వేలు, ఎంజిఐటి కాలేజీలో రూ.లక్షా 67 వేలు, సివిఆర్ కాలేజిలో రూ.లక్షా 63 వేలు, రూ.లక్షా 62 వేలు, గోకరాజు కాలేజీలో రూ. లక్షా 60 వేలు, విఎన్‌ఆర్ కాలేజిలో రూ. లక్షా 59 వేలు గా ఫీజులు ఉన్నాయి.

ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా క్యాపిటేషన్ ఫీజు లేదా డొనేషన్ల రూపంలో ఎలాంటి వసూళ్లకు పాల్పడకూడదని ఈ ఉత్తర్వులలో ప్రభుత్వం హెచ్చరించింది. వార్షిక ట్యూషన్ ఫీజును ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో అడ్వాన్సుగా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. కళాశాలలు సమర్పించిన వివరాల ఆధారంగా ప్రస్తుతం ఫీజులు నిర్ణయించినప్పటికీ, భవిష్యత్‌లో తమ తనిఖీల్లో ఏవైనా తప్పుడు వివరాలు ఉన్నట్లు తేలితే ఫీజులను సవరించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరించింది.