Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: మార్చి మొదటి వారంలోనే బానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది సూర్యుడి ప్రతాపానికి ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వా తావరణ కేంద్రం అంచనా వేసింది. సాధారణంగా మార్చి మూ డో వారంలో ఎండ తీవ్రత పెరుగుతుంది. దీనికి భిన్నంగా ఈ ఏడాది మార్చి ఆరంభంలోనే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. గురువారం అత్యధికంగా ములుగు జిల్లా ల్లో 39 డిగ్రీల గరి ష్ట ఉష్ణోగ్రతలు నమోదయిన ట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నా సమయంలో ఉద్యోగ, ఉపాధి, వ్యాపా ర, ఇతర కార్యకలాపాలకు బయకు వచ్చిన ప్రజ లు ఈ ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నా రు. గత మూడు రోజులుగా ప్రతి రోజు ఎండ తీ వ్రత పెరుగుతోంది.

ఇప్పటికే భారత వాతారణ శా ఖ ఈ వేసవిలో ఎండల పరిస్థితిపై విడుదల చే సిన నివేదికలో తీవ్రతను తెలిపింది. దీంతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే ఎండ వేడిమి 39 డిగ్రీలకు చే రుకోవడంతో ఈ ఏడాది ఎండ తీవ్రత పట్ల ప్రజ లు భయాందోళనలు వ్యక్తం చేస్తోన్నారు. దీంతో పాటు రాబోయే వారం రోజుల పాటు ఎండలు సాధారణం కన్నా ఒకటి, రెండు డిగ్రీలు అధికం గా నమోదవుతాయని అధికారులు వెల్లడిస్తున్నా రు. రాష్ట్ర వైపు వీస్తున్న గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నా రు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు నుండి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ములుగులో 39 డిగ్రీలు, జగిత్యాల, ఆదిలాబాద్, ఖమ్మం 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే మూ డు రోజులకు సైతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.