
మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ని ర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈ సీ) సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ శుక్రవా రం జారీ చేసింది. ఏప్రిల్‌లో ఈ ఎస్‌ఐఆర్ ప్రా రంభం కానుండగా ఇందుకు సంబంధించిన స న్నాహక శిక్షణా కార్యక్రమాలను చేపట్టింది. తె లంగాణలో రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఈ శిక్షణా కార్యక్రమాలను చేపట్టారు. తెలంగాణలో ఈ ప్రక్రియకు సంబంధించి మే నా టికి క్షేత్రస్థాయి పనులు వేగవంతం కానున్నాయి. 2002 నాటి పాత డేటాను ప్రస్తుత ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేసే పనిని అధికారు లు ఇప్పటికే మొదలుపెట్టారు. సాధారణం గా ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మరీ రి విజన్‌లో కేవలం మార్పులు, చేర్పులు మాత్ర మే చేస్తారు.
కానీ, ‘సర్’ అనేది లోతైన ప్రక్రి య. బూత్ లెవల్ ఆఫీసర్లు నేరుగా ప్రతి ఇం టికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఉన్న ఓట్లను గుర్తిస్తారు. పట్టణీకరణ వల్ల ప్రాంతా లు మారిన వారి ఓట్లను సరిచేసేందుకు సర్ ఉపయోగపడుతుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కు ముందే బీహార్‌లో సర్ ప్రక్రియను కేంద్రఎన్నిక ల సంఘం పైలట్ ప్రాజెక్టుగా పూర్తిచేసింది. రెండోదశలో భాగంగా 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాం తాల్లో సర్ ప్రక్రియను చేపట్టి ఫిబ్రవరిలో తుది ఓ టర్ల జాబితాను విడుదల చేసింది. దేశంలో నకిలీ ఓట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో నకిలీ ఓట్లను తొలగించి, ఓటర్ల లిస్టును ప్ర క్షాళన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ సర్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో సర్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది.