
హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్‌ల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అందచందాలతో ప్రేక్షఖుల మనస్సు దోచుకున్న సుందరి జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తూనే.. టాలీవుడ్‌లో ఎన్టిఆర్ ‘దేవర’ సినిమాతో సూపర్‌హిట్ అందుకుంది. కాగా, జాన్వీ శుక్రవారం తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, స్నేహితులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో జాన్వీ నటి్స్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ‘పెద్ది’ మూవీ టీం ఓ ప్రత్యేక వీడియో ద్వారా అమె శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమాలో జాన్వీ పాత్ర ఎలా ఉండనుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
కాగా, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నారు.