Reading Time: < 1 minute

అమరావతి: వైసిపి నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలోని పి వి ఎస్ ఆర్ గోడౌన్ లో వైసిపి నేత శివరామిరెడ్డిను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచారు. ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి కత్తులతో దాడి చెయ్యడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది. టిడిపి ఎంఎల్ఎ అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ తనపై దాడి చేశాడని, తనను చంపడానికి వచ్చినట్లు గుర్తించానని బాధితుడు శివరామిరెడ్డి ఆరోపణలు చేశాడు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని శివరాంరెడ్డిని పరామర్శించారు. అఖిల ప్రియ భర్త కేవలం డబ్బులు కోసమే శివరామిరెడ్డి పై దాడి చేయించారంటూ భూమా విమర్శించారు. శివరామిరెడ్డిని అత్యవసర చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోజు రోజుకు శాంతి భద్రతలు క్షిణించిపోతున్నాయని, ఆళ్లగడ్డలో రౌడీయిజం రాజ్యం ఏలుతుందని, తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతాకాల్సి వస్తుందని వైసిపి శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి.