
హోబార్ట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హోబార్ట్ వేదికగా భారత మహిళ జట్టుతో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళ జట్టు భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆసీస్ కెప్టెన్ అలీసా హేలీ ఉతకి ఆరేసింది. 98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సులతో 158 పరుగులు చేసింది. కీపర్ బెత్ మూనీ 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సుతో 106 పరుగులు చేసింది. జార్జియా వోల్ (62), నికోలా క్యారీ (34) రాణించారు. దీంతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. అయితే ఈ భారీ లక్ష్య చేధనలో భారత్ 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (21), హర్లిన్ డియోల్ (14) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ మరో 301 పరుగులు చేయాలి.