
ఖమ్మం: వెలుగుమట్లలోని భూదాన్ భూములను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పరిశీలించారు. భూనిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ‘‘భూదాన్ బోర్డు పట్టాలున్న పేదల ఇళ్లను కూల్చివేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం. పేదల ఇళ్లు కూలగొట్టి ఏం సాధించారు? బాధితుల పక్షాన బిజెపి పోరాడుతుంది. కూల్చిన చోట పేదల 100 గజాలలో ఇల్లు నిర్మించి ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పేదలను పంపించేస్తున్నారు’’ అని ఆరోపించారు.