Reading Time: < 1 minute

సఫారీలు గెలవాలని..ఇవాళ వెస్టిండీస్‌‌తో మ్యాచ్‌‌

Caption of Image.

అహ్మదాబాద్‌‌: వరుస విజయాలతో దూసుకెళ్తున్న సౌతాఫ్రికా, వెస్టిండీస్‌‌ టీ20 వరల్డ్ కప్‌‌లో సెమీఫైనల్ బెర్తుపై గురి పెట్టాయి.  సూపర్‌‌‌‌–8 రౌండ్‌‌ తొలి పోరులో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ఇండియాను ఓడించి ఔరా అనిపించిన సఫారీ టీమ్ అదే జోరుతో గురువారం జరిగే మ్యాచ్‌‌లో వెస్టిండీస్  పని పట్టాలని చూస్తోంది. 

ఈ మ్యాచ్ ప్రధానంగా  విండీస్ హిట్టర్లకు, సౌతాఫ్రికా పేస్ దళానికి మధ్య జరగనున్న పోరుగా  కనిపిస్తోంది.  ఇందులో విండీస్ గెలిస్తే  ఇండియా పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. తర్వాతి రెండు మ్యాచ్‌‌ల్లో భారీ ఆధిక్యంతో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే సమీకరణాలు ఇండియాకు కొంతవరకు అనుకూలంగా మారతాయి. కాబట్టి సఫారీలే గెలవాలని ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.