Reading Time: < 1 minute

ఇంటర్ ఎగ్జామ్స్ షురూ.. 5నిమిషాలు ఆలస్యం అయినా అనుమతి

Caption of Image.

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ బుధవారం(ఫిబ్రవరి 25)  ప్రారంభమయ్యాయి.  ఈ ఏడాది మొత్తం 9లక్షల 97వేల075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, అందులో ఫస్ట్ ఇయర్  విద్యార్థులు 4,89,126 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. ఇవాళ్టి నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జా్మ్స్ నిర్వహిస్తారు. అయితే ఈసారి టైమింగ్స్ పై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అమలులో ఉన్న ఒక్కనిమిషం  నిబంధనపై విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ఐదు నిమిషాల వరకు వెసులుబాటు ఇచ్చింది.  ఎటువంటి అక్రమాలు జరగకుండా ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అన్ని పరీక్ష కేంద్రాల్లో  సీసీ కెమెరాలు, ప్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్వ్కాడ్స్ తో నిఘా పెంచింది. 

సెంటర్లలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించబోమని వెల్లడించారు. ఈసారి స్టూడెంట్ల హాల్ టికెట్లను నేరుగా వాట్సాప్ ద్వారా పంపడమే కాకుండా, వెబ్‌‌‌‌సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. పరీక్షల నిర్వహణలో ఏవైనా అవకతవకలు జరిగితే సంబంధిత ఆఫీసర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

©️ VIL Media Pvt Ltd.