Reading Time: < 1 minute
Morena Train Accident Four Killed After Fire Rumour Sparks Panic

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. రైలులో వ్యాపించిన పుకారు నలుగురు ప్రాణాలను తీసింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయనే వదంతులు వ్యాపించడంతో, భయపడిన ప్రయాణికులు రైలు నుంచి బయటకు దూకారు. ఇదే సమయంలో వేరే ట్రాక్‌పై వస్తున్న రైలు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.

ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ మోరేనా జిల్లాలోని హేతంపూర్ స్టేషన్‌కు సమీపిస్తున్న సమయంలో, రైలుకు మంటలు వ్యాపించాయనే పుకారు వ్యాపించింది. ఈ విషయంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి పట్టాలపై దూకారు. ఇదే సమయంలో పక్క ట్రాక్‌పై నుంచి వస్తున్న పాతాళ్‌లోక్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వీరిని ఢీకొట్టింది. రెప్పపాటు క్షణాలలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి అధికారులు, జిల్లా యంత్రాంగం చేసుకుని, సహాయక చర్యలు ప్రారంభించింది.

ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ పుకారు ఎక్కడి నుంచి వ్యాపించింది.? ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేశారా? అనే కోణంలో విచారణ జరుగుపుతున్నారు. ప్రయాణికులు చెబుతున్న దాని ప్రకారం.. అకస్మాత్తుగా ఎవరో చైన్ లాగి మంటలు అని అరిచినట్లు చెప్పారు. దీంతో జనం రైలు దిగారని, ప్రయాణికులు పట్టాలు దాటుతుండగా, మరో రైలు వీరిని ఢీకొట్టినట్లు చెప్పారు. చనిపోయిన వారు ఒకే కుటుంబానిక చెందిన వారిగా గుర్తించారు. కుటుంబంలోని భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు మరణించారు.