Reading Time: < 1 minute

పెద్దపల్లిలో కాంగ్రెస్ నేత శ్రీధర్ పటేల్ బర్త్‌డే వేడుకల్లో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ

Caption of Image.

పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఉరగొండ శ్రీధర్ పటేల్ పుట్టినరోజు వేడుకలు  జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

శ్రీధర్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణలు ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం శ్రీధర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి,  ఎంపీ.. శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ చురుకుగా పాల్గొంటారని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ, నిరంతరం ప్రజల సేవలో ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

©️ VIL Media Pvt Ltd.