సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిదని, వాటిని పోషకాల నిధి అని మనందరికీ తెలిసిందే. అందుకే మన రోజువారీ ఆహారంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే, అత్యంత పోషకాలు ఉన్న ఆకుకూరలలో ‘తోటకూర’ చాలా ప్రత్యేకమైనది. ఇందులో మనకు ప్రధానంగా ఆకుపచ్చ, ఎరుపు అనే రెండు రకాలు కనిపిస్తాయి. మామూలు తోటకూరతో పోలిస్తే ఎర్ర తోటకూరలో అద్భుతమైన పోషకాలు కొండంత ఉన్నాయి. వారంలో కనీసం రెండుసార్లు ఈ ఎర్ర తోటకూర తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
పోషకాల పండగ.. ఎర్ర తోటకూర: ఎర్ర తోటకూరలో మన శరీరానికి కావలసిన విటమిన్-ఏ, సి ఈ బి లతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఫాస్ఫరస్, జింక్, ప్రోటీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఇన్ని రకాల పోషకాలు ఒకే ఆకుకూరలో లభించడం వల్ల ఇది మన బాడీకి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తుంది.
రక్తహీనతకు చెక్.. హిమోగ్లోబిన్ వృద్ధి: ఈ రోజుల్లో చాలా మందిని వేధించే ప్రధాన సమస్య రక్తహీనత. శరీరంలో బ్లడ్ పర్సంటేజ్ లేదా హిమోగ్లోబిన్ లెవల్స్ తక్కువగా ఉన్నవారికి ఎర్ర తోటకూర ఒక వరం లాంటిది. ఇక ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని చాలా వేగంగా పెంచుతుంది. అలాగే ఇది మన రక్తాన్ని కూడా శుద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

జీర్ణ సమస్యలు మాయం.. కంటికి ఎంతో మేలు: ఎర్ర తోటకూరలో డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరిచి, చాలా మంది బాధపడే మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇక దీనితో పాటు ఇందులో ఉండే విటమిన్-ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది.
మెరిసే చర్మం..యవ్వనంగా మార్చే మ్యాజిక్: ఎర్ర తోటకూర కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి. చర్మంపై వచ్చే ముడతలు, మొటిమలను తగ్గించి, ముఖాన్ని ఎల్లప్పుడూ కాంతివంతంగా, అందంగా మెరిసేలా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు దీనిని అస్సలు మిస్ అవ్వకూడదు.
మొత్తానికి చూస్తే, ఎర్ర తోటకూర అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక చౌకైన అద్భుత ఔషధం. రోజూ కాకపోయినా కనీసం వారంలో రెండు రోజులైనా ఈ ఆకుకూరను వండుకుని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. కాబట్టి మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఎర్ర తోటకూర కనిపిస్తే అస్సలు వదలకుండా తెచ్చుకుని, మీ డైట్‌లో భాగం చేసుకోండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం సాధారణ ఆరోగ్య సూత్రాలు మరియు నిపుణుల సూచనల ఆధారంగా మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారు తమ డైట్‌లో పెద్ద మార్పులు చేసుకునే ముందు డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.
The post రోజూ తింటే అద్భుత ఫలితాలు.. ఈ ఆకుకూర మిస్ అవ్వొద్దు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.