Reading Time: 2 minutes

ఫస్ట్ బాల్నే సిక్స్ కొట్టిన షెఫాలీ వర్మ.. చోటీ సూర్యవంశీ అంటూ నెట్టింట కామెంట్స్

Caption of Image.

Choti Sooryavanshi: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ అత్యంత నాటకీయంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ తనదైన శైలిలో ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చింది. మ్యాచ్‌ తొలి బంతికే భారీ సిక్స్ కొట్టి పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచింది. అదే ఓవర్లో షఫాలీ అవుట్ కావడంతో భారత్‌కు గట్టి షాక్ తగిలింది.

మొదటి బంతికే సిక్స్: 
తన ఫియర్‌లెస్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన షఫాలీ వర్మ.. పాక్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతినే బౌండరీ అవతలికి పంపించి పాక్ క్యాంప్‌లో వణుకు పుట్టించింది. అయితే, తొలి బంతికే సిక్స్ కొట్టిన భయపడని సాదియా.. ఆ తర్వాత బంతికే అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చింది. షఫాలీ క్రీజు వెలుపలికి వచ్చి మరో భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించగా.. ఇక్బాల్ తెలివిగా బంతిని కొంచెం షార్ట్‌గా వేసింది. దాంతో బంతి ఊహించిన దానికంటే ఎక్కువ బౌన్స్ అయ్యి, షఫాలీ బ్యాట్ అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని వెనక్కి వెళ్లగా.. వికెట్ కీపర్ మునీబా అలీ ఏమాత్రం తడబడకుండా ఆ క్యాచ్‌ను అందుకోవడంతో షఫాలీ పెవిలియన్ కి చేరుకుంది. 

నెట్టింట చోటీ సూర్యవంశీ ట్రెండింగ్:
మొదటి బంతికే సిక్స్ కొట్టి అవుట్ అయిన షఫాలీ వర్మ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఆమె భయం లేని ఆటతీరును, బౌండరీలు దాటించే కెపాసిటీని చూసి.. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీతో పోల్చుతున్నారు. ఫస్ట్ బంతికే సిక్స్ కొట్టడం అంటే మామూలు గుండె ధైర్యం కాదు.. షఫాలీ పక్కా ‘చోటీ సూర్యవంశీ’ (Choti Sooryavanshi)” అంటూ ఎక్స్ (X) లో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అవుట్ అయినా సరే పాక్‌పై ఆ మాత్రం అటాకింగ్ ఇంటెంట్ చూపించడం కరెక్ట్ అని కొందరు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరేమో కొంచెం నిలకడగా ఆడి ఉంటే బాగుండేదని పేర్కొంటున్నారు. 

►ALSO READ | IND-W vs PAK-W: అబ్బాయిల బాటలోనే అమ్మాయిలు.. ఇండియా, పాక్ మ్యాచులో నో షేక్ హ్యాండ్

18 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయిన భారత్: 
 పాకిస్తాన్ తో జరుగుతున్న తమ ఫస్ట్ మ్యాచులో భారత జట్టు తడబడింది. ఓపెనర్ షఫాలీ వర్మ (6), జెమీమా రోడ్రిక్స్(1) త్వరగానే పెవిలియన్ చేరడంతో కష్టాల్లో పడింది. కానీ మరో ఎండ్ లో ఉన్న స్మృతి మంధాన మాత్రం అద్భుతంగా ఆడుతుంది. ఆమెకు సపోర్టు ఇస్తూ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ చేస్తుంది. ప్రస్తుతం టీమిండియా 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు పూర్తి చేసుకుంది.  

©️ VIL Media Pvt Ltd.