
పారిస్: భారతదేశ ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’ ఆగదని.. అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ దశాబ్దం విప్లవాత్మక మార్పులకు, అభివృద్ధికి సంబంధించినదని పేర్కొన్నారు. జీ7 సదస్సు కోసం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ ఆదివారం (జూన్ 14) నైస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆవిష్కరణలు అనేవి భారతదేశ నైజంలోనే ఉన్నాయని… సుస్థిర భవిష్యత్తు, ప్రపంచం కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందని అన్నారు. భారతదేశం ప్రపంచంలో పరిష్కారాలను స్వీకరించే దేశంగా కాకుండా.. పరిష్కారాలను అందించే దేశంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో భారతదేశం ఒక బలమైన ఆవిష్కరణల వ్యవస్థను సృష్టించిందని.. నేడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా ఇండియా ఉందన్నారు.
►ALSO READ | ఒమన్ తీరంలో మునిగిన భారతీయ నౌక..14 మంది సిబ్బందిని రక్షించిన అమెరికా నౌకాదళం!
స్టార్టప్‌లు భారతదేశ వృద్ధికి, అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ దశాబ్దం విప్లవాత్మక మార్పులకు, అభివృద్ధికి రెండింటికీ సంబంధించినదని అన్నారు. సాంకేతికను కొత్త పుంతలు తొక్కించేందుకు ఇండియాతో కలిసి పని చేసేందుకు రావాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఏఐ రంగంలో భారతదేశానికి అపారమైన సామర్థ్యం ఉందని.. నూతన ఆవిష్కరణల ద్వారా జీవితాలను మార్చవచ్చని అన్నారు.