
Team India: గత కొన్నేళ్లుగా టీమిండియాని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ లేకపోవడమే.. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వేళ.. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ని దృష్టిలో పెట్టుకుని భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా వార్నింగ్ ఇచ్చాడు. భారత్ గత రెండు ప్రపంచకప్‌లలో ఎక్కువగా హార్దిక్ పైనే ఆధారపడింది. కానీ, అతడు 2019లో వెన్నునొప్పితో, 2023 ప్రపంచకప్ టోర్నీ మధ్యలోంచే గాయంతో జట్టుని వదిలి పెట్టాడు. కీలక సమయాల్లో హార్దిక్ దూరం కావడంతోనే 2సార్లు టైటిల్స్ ని మిస్ చేసుకోవడం జరిగిందని సురేష్ రైనా వెల్లడించాడు.
రీప్లేస్‌మెంట్ ప్లేయర్ రెడీ చేస్కోండి:
సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2027 అక్టోబర్ 4 నుంచి వన్డే వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. ఆఫ్రికా పిచ్‌లపై ఫాస్ట్ బౌలర్లు, పేస్ ఆల్ రౌండర్లే చాలా కీలకం కానున్నారు. ఇలాంటి సమయంలో , ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించిన హార్దిక్, మళ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడి సిరీస్ కి దూరం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అందుకే, హార్దిక్‌కు సరైన రీప్లేస్‌మెంట్ ప్లేయర్ ని ఇప్పుడే రెడీ చేసుకోవాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా సూచించాడు.
బౌలింగ్ లో నితీష్ మెరుగువ్వాల్సిందే:
హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌తో ఉంటే జట్టుకు కొండంత బలం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ అతను వర్క్‌లోడ్‌ను మేనేజ్‌మెంట్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలని సురేష్ రైనా తెలిపాడు. ఒకవేళ పాండ్యా అందుబాటులో లేకపోతే జట్టులో ఆ ప్లేస్ ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్నకు భారత మేనేజ్మెంట్ ఇప్పుడే ఆన్సర్ రెడీ చేసుకోవాలన్నాడు. ప్రస్తుతం యువ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి జట్టుకు అందుబాటులో ఉన్నాడు.. అతను బౌలింగ్ లో ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉందని రైనా పేర్కొన్నాడు.
►ALSO READ | భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. బర్మింగ్‌హామ్‌లో థండర్‌స్టార్మ్ అలర్ట్!
రో– కో అనుభవం ఎంతో అవసరం:
మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రాధాన్యతపై కూడా సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. గత ప్రపంచకప్‌లలో రోహిత్, విరాట్ అద్భుతంగా రాణించి జట్టును ముందుండి నడిపించారని కొనియాడారు. శుభ్‌మన్ గిల్ వంటి యంగ్ ప్లేయర్స్ కి రో– కో లాంటి సీనియర్ల తోడు, అనుభవం ఎంతో అవసరం.. ఫిట్‌నెస్‌తో ఉంటే ఏ ఆటగాడికైనా వయసు అనేది అస్సలు సమస్య కాదని రైనా తేల్చి చెప్పాడు.