Reading Time: 2 minutes
Bigg Boss 10 Telugu: ఈసారి రచ్చ రచ్చే.. బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ.. పేరు రివీల్ చేసిన యాంకరమ్మ..

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి కింగ్ నాగార్జున హోస్ట్‌గా ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “ఈసారి ఆట మరింత కఠినంగా ఉండబోతోంది” అని తాజా ప్రోమోలోనే హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే సస్పెన్స్ నెట్టింట నడుస్తోంది. అయితే, అందరికంటే ముందే తొలి కంటెస్టెంట్ పేరును జబర్దస్త్ ఫేమ్, యాంకర్ వర్ష అధికారికంగా కాకపోయినా సరదాగా బయటపెట్టడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ప్రస్తుతం వర్ష ఒక టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షోకి ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక నల్కారి అతిథిగా హాజరైంది. ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ప్రస్తావన రాగా ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “గతంలో నాకు తమిళ బిగ్ బాస్, అలాగే తెలుగు బిగ్ బాస్ నుండి ఆఫర్స్ వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు వెళ్లలేకపోయాను. ఒకవేళ ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుండి పిలుపు వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను, నేను సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేసింది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

ప్రియాంక సమాధానం విన్న వెంటనే యాంకర్ వర్ష స్పందిస్తూ.. “అయితే బిగ్ బాస్ 10 మొదటి కంటెస్టెంట్ దొరికేసినట్టే. ప్రియాంక నల్కారి ఈ సీజన్ లో అడుగుపెట్టబోయే తొలి కంటెస్టెంట్” అంటూ ప్రకటించేసింది. దీనికి ప్రియాంక కూడా నవ్వుతూ అవునని సైగ చేసింది. తెలుగులో ‘శ్రావణ సమీరాలు’, ‘మంగమ్మ గారి మనవరాలు’ వంటి సీరియల్స్‌తో పాటు, తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రోజా’ సీరియల్ ద్వారా ప్రియాంక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అలాగే ‘SMS’, ‘కిక్ 2’, ‘కాంచన 3’ వంటి సినిమాల్లోనూ నటించింది. వర్ష చేసిన ఈ కామెంట్స్ కేవలం సరదా కోసమేనా లేక నిజంగానే ప్రియాంక హౌస్‌లోకి వెళ్తోందా అనేది తెలియాలంటే బిగ్ బాస్ టీమ్ నుండి అఫీషియల్ లిస్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే!

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ప్రియాంక పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@nalkarpriyanka)

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు