Reading Time: < 1 minute

ఎల్‌నినో ముప్పుతో అలర్ట్.. ప్రత్యామ్నాయ పంటలు, వాట్సాప్ సలహాలతో ముందస్తు ప్లాన్ 

Caption of Image.

తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌కు వ్యవసాయ శాఖ సర్వసిద్ధమైంది.ఎల్‌నినో ప్రభావాన్ని ముందే అంచనా వేసి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. వరిపైనే ఆధారపడకుండా కందులు, జొన్నలు, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలను జిల్లాల్లో ముందే నిల్వ ఉంచింది.

ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ లో కీలక మార్పులు చేశారు. ఇప్పుడు డీలర్ల స్టాక్ వివరాలు, మండల మ్యాపింగ్‌తో పాటు మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఎరువులను బుక్ చేసుకోవచ్చు. రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ కూడా అందుబాటులోకి వస్తోంది.

►ALSO READ | కేసీఆర్ ప్రతి సంక్షేమ పథకం వెనక ఓ విజన్: హరీష్ రావు

అంతేకాదు, వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం” చేపట్టింది. ఇప్పటివరకు 18 జిల్లాల్లోని 28 లక్షల మందికి పైగా రైతులకు నేరుగా వాట్సాప్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అందిస్తూ, పంట నష్టాలను తగ్గించేందుకు వ్యవసాయ శాఖ ముందడుగు వేస్తోంది. రైతులంతా అధికారుల సూచనలు పాటించి, లాభసాటి వ్యవసాయం చేయాలని ప్రభుత్వం కోరుతోంది.

©️ VIL Media Pvt Ltd.