Reading Time: < 1 minute

కేసీఆర్ ప్రతి సంక్షేమ పథకం వెనక ఓ విజన్: హరీష్ రావు

Caption of Image.

వరంగల్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకం వెనక ఓ విజన్ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం (జూన్ 14) హరీష్ రావు హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పోవాలే కేసీఆర్ రావాలని జనం అంటున్నారని అన్నారు. సమాజంలో సామాజిక రుగ్మతలను దూరం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 

చట్టాలు, పోలీసులు చేయలేని పనిని కళ్యాణలక్మితో కేసీఆర్ చేశారని.. కళ్యాణ లక్ష్మీతో బాల్య వివాహాలు ఆగిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలపై రెండున్నర ఏళ్లుగా అవిశ్రాంతంగా కొట్లాడుతున్నామని అన్నారు. కార్యకర్తల అండదండలతోనే హైడ్రాలాంటి అరాచకాలపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటినుంచే పార్టీ గెలుపు కోసం పని చేయాలని.. తెలంగాణలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానేని అన్నారు. 

►ALSO READ | ఓట్లను కాపాడుకునే బాధ్యత బూత్ స్థాయి కార్యకర్తలదే: ఎంపీ వంశీకృష్ణ

©️ VIL Media Pvt Ltd.