
India Women vs Pakistan Women, Women’s T20 World Cup 2026 Live Score Updates: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. గత టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్స్‌కు చేరుకోగా, పాకిస్తాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో భారత్ 13, పాకిస్తాన్ 3 మ్యాచ్‌లు గెలిచాయి. టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు 8 సార్లు తలపడగా, భారత్ 6, పాకిస్తాన్ 2 మ్యాచ్‌లు గెలిచాయి.