Reading Time: < 1 minute

ఖాన్ సర్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. రోషన్ ఆనంద్ సోదరుడి మిస్టీరియస్ డెత్

Caption of Image.

యూపీలోని ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ పై  కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్.. ప్రత్యర్థి కోచింగ్ సెంటర్ యజమాని రోషన్ ఆనంద్ సోదరుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. యూపీ, నేపాల్ సరిహద్దులోని ఓ హోటల్ లో కొందమంది స్నేహితులతో కలిసి బస చేస్తున్న రోషన్ ఆనంద్ సోదరుడు  ప్రిన్స్ యాదవ్ తెల్లవారేసరికి చనిపోయిఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రిన్స్ యాదవ్ ఫ్రెండ్స్ ను అదుపులోకి తీసుకున్న నేపాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నేపాల్‌లోని బిరాట్‌నగర్‌లోని ఓ హోటల్‌లో ప్రిన్స్ యాదవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. పాట్నాలోని ఖాన్ సర్ కోచింగ్ వివాదానికి సంబంధించి ప్రిన్స్ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాగా అప్పటినుంచి పరారీలో ఉన్నారు. అయితే ఆదివారం  ప్రిన్స్ యాదవ్ ఆకస్మిక మరణం పలు అనుమానాలను లేవనెత్తుతోంది. మరోవైపు ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ పై కాల్పుల కేసులో ప్రత్యర్థికోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రోషన్ ఆనంద్ ప్రస్తుతం పాట్నాలోని బేయూర్ జైలులో ఉన్నాడు.

ఖాన్ సర్ కేసులో ఏం జరిగింది?

జూన్ 2వ తేదీ రాత్రి, ఖాన్ గ్లోబల్ స్టడీస్ ,జ్ఞాన్ బిందు కోచింగ్‌కు చెందిన వ్యక్తుల మధ్య వివాదం చెలరేగింది. జ్ఞాన్ బిందు కోచింగ్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఖాన్ సర్ సంస్థ బయట ఉన్న బ్యానర్లు, పోస్టర్లను చించేసి, సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఖాన్ సర్ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో రోషన్ ఆనంద్, అతని ఇద్దరు సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేశారు. ఇదే కేసులో రోషన్ సోదరుడు ప్రిన్స్ పరారీలో ఉన్నాడు. దర్యాప్తులో  ఖాన్ సర్ బాడీగార్డులు కూడా కాల్పులు జరుపినట్లు తేలింది.వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఖాన్ సర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ముందస్తు బెయిల్ మంజూరైంది. రోషన్ ఆనంద్ 12 రోజులుగా జైలులో ఉన్నాడు.

►ALSO READ | అయోధ్య రామ మందిర విరాళాల్లో అక్రమాలు.. సిట్ విచారణకు యోగి సర్కార్ ఆదేశం

©️ VIL Media Pvt Ltd.