
India Women vs Pakistan Women: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్ దాయాదుల పోరుకు టాస్ పడింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమాత్రం ఆలోచించకుండా మొదట బ్యాటింగ్ తీసుకుంది. పిచ్ కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో.. బోర్డుపై భారీ స్కోరు బోర్డును ఉంచి పాకిస్తాన్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని టీమిండియా పక్కా ప్లాన్ వేసింది.
టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాం.. బ్యాటింగ్ చేయడానికి ఇది చాలా అద్భుతమైన పిచ్.. మొదట బ్యాటింగ్ చేసి బోర్డుపై ఒక మంచి టోటల్ సెట్ చేయాలనుకుంటున్నాం.. టీమ్ మొత్తం ఈ మ్యాచ్ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.. గతేడాది వన్డే వరల్డ్ కప్ గెలిచిన కాన్ఫిడెన్స్‌ను ఈ టోర్నీలో కూడా కొనసాగిస్తాం.. మైదానంలో బెస్ట్ క్రికెట్ ఆడటమే మా టార్గెట్.. ఈ మ్యాచ్‌లో భారతి జట్టులోకి వచ్చింది.. మేము ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు మీడియం పేసర్లతో బరిలోకి దిగుతున్నామని కౌర్ స్పష్టం చేసింది.
►ALSO READ | కప్ కొట్టి భారత్కి తీసుకొని రండి.. పాక్తో పోరుకు ముందు ఉమెన్స్ టీమ్‌కు రోహిత్, గంభీర్ స్పెషల్ మెసేజ్
పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. ఒకవేళ టాస్ గెలిస్తే మేము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం.. ఇదొక మంచి బ్యాటింగ్ ట్రాక్ లా కనిపిస్తోంది.. ఒక టీమ్‌గా మేము బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బాగా రాణించబోతున్నాం.. ఇక్కడ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉన్నా.. మా దగ్గర మంచి బౌలింగ్ ఎటాక్ ఉంది.. ఈ మ్యాచ్‌లో సైరా ఆడుతోంది.. ఆమెకు ఇదే మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ అని చెప్పుకొచ్చింది.
పాకిస్థాన్ మహిళా జట్టు: గుల్ ఫిరోజా, మునీబా అలీ (వికెట్ కీపర్), అయేషా జాఫర్, సైరా జబీన్, నటాలియా పర్వైజ్, అలియా రియాజ్, ఫాతిమా సనా (కెప్టెన్), రమీన్ షమీమ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్, తస్మియా రుబాబ్
భారత మహిళా జట్టు: స్మృతి మంధాన, షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, భారతీ ఫుల్మాలి, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, అరుంధతీ రెడ్డి