Reading Time: < 1 minute

లవ్ బ్రేకప్.. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

Caption of Image.

గచ్చిబౌలి, వెలుగు: లవ్ బ్రేకప్ తట్టుకోలేక ఓ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీకి చెందిన కోమలి బోను(21) మల్లారెడ్డి వర్సిటీలో బీఎస్సీ చదువుకుంటూనే మరోవైపు వీడియోలు చేస్తూ యూట్యూబర్​గా గుర్తింపు తెచ్చుకుంది. సాప్ట్​వేర్ ఉద్యోగం చేసే మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేండ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ ఏడాది కింద మనస్పర్థల వల్ల విడిపోయారు.

అయితే అఖిల్​ను మర్చిపోలేక కోమలి తీవ్ర మనోవేదనకు గురై గతంలోనూ ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అడ్డుకొని కాపాడారు. కాగా, రెండు రోజుల కింద కోమలి మళ్లీ అఖిల్ రెడ్డికి ఫోన్ చేయగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు చీరతో ఉరేసుకొని మృతి చెందింది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.