
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల పంపకాల వాటా ఒప్పందం (2015) విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కనీసం 500 టిఎంసిల నీళ్ళ కోసం గట్టిగా పట్టుబట్టాల్సిన సమయంలో అ ప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం 299 టిఎంసిలకే అంగీకరించి సంతకాలు చేయడం వ ల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లి, మరణ శాసనంగా మారిందని మహారాష్ట్ర ప్రభు త్వ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఆందోళ న వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చా రు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను బి జెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, పార్టీ నాయకులు అంజిరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎన్‌వి సుభాష్ తదితరులు వీక్షించారు. రాష్ట్రం తరఫున సమర్థంగా వాదించి ఉంటే కనీసం నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై టిఎంసిల వరకు నీళ్ళు పొందే అవకాశం ఉండేదని వెదిరె తెలిపారు. కృష్ణా జలాల వాటా ఒప్పందంలో రెండు వందల టిఎంసిలకే సంతకం చేయడం వల్ల
పదేళ్ళుగా రాష్ట్రానికి మరణ శాసనంగా మారిందని వెదిరె శ్రీరామ్ విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బిసి, డిండి, కోయల్ సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన నీళ్ళను 2015 అప్పటి వాటర్ షేరింగ్ ఒప్పందంలో చేర్చకపోవడం ఘోర తప్పిదమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులకు కనీసంగా 261.7 టిఎంసి నీళ్ళు అవసరం ఉన్నప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా 299 టిఎంసికే ఒప్పుకోవడం వల్ల అన్యాయం జరిగిందని ఆయన వివరించారు. 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా మరో ఏడాది పాటు అదే ఒప్పందాన్ని కొనసాగిస్తూ అప్పటి ముఖ్యమంత్రులు సంతకాలు చేశారని ఆయన చెప్పారు. 2020 వరకు కొనసాగిస్తూ సంతకాలు జరిగాయని ఆయన తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆలస్యం చేయడం వల్లే ఎపికి వర్క్ ఆర్డర్లు ఇచ్చే అవకాశం లభించిందని వెదిరె శ్రీరామ్ అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొత్త ట్రిబ్యునల్ ద్వారానే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.