
Syed Mushtaq Ali Trophy 2025: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025 సూపర్ లీగ్ గ్రూప్ ఏ లో థ్రిల్లర్ మ్యాచ్ కనువిందు చేసింది. ఆంధ్రప్రదేశ్- ఝార్ఖండ్ మధ్య జరిగిన సూపర్ మ్యాచ్ మామూలుగా లేదు. ఈ మ్యాచ్‌లో ఝార్ఖండ్ 9 రన్స్ తేడాతో ఓడిపోయింది. అయినా కూడా ఝార్ఖండ్ నయా చరిత్ర సృష్టిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఝార్ఖండ్ టీం కెప్టెన్ ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఈ జట్టు మొదటిసారి ఎస్‌ఎంఏటీ ఫైనల్‌కు చేరుకుంది. డిసెంబర్ 18న పుణెలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఝార్ఖండ్ ప్రత్యర్థి ఎవరో త్వరలోనే రివీల్ కానుంది.
READ ALSO: Tejasvi Singh-IPL 2026: కేకేఆర్‌కు కొత్త యువ వికెట్ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్!
ఆంధ్ర బౌలర్ల ధాటికి ఝార్ఖండ్ 194/8కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 203/7 స్కోరు నమోదు చేసింది. తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఝార్ఖండ్ తరుఫున ఇషాన్ కిషన్ – విరాట్ సింగ్ 88 రన్స్ భాగస్వామ్యంతో పోరాడారు. కానీ చివరి ఓవర్లలో వికెట్లు కోల్పోయి 9 రన్స్ తేడాతో ఝార్ఖండ్ ఓటమి పాలైంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ వెలుగు చూసింది. నిజానికి ఫైనల్ బెర్త్ చేరుకోడానికి ఈ ఓటమి ఝార్ఖండ్‌ను ఆపలేదు. ఇప్పటికే ఈ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు సాధించి, మంచి నెట్ రన్‌రేట్ (+0.221)తో గ్రూప్ ఏలో టాప్‌లో నిలిచింది. ఇదే సమయంలో ఆంధ్ర మాత్రం నెట్ రన్‌రేట్ (-0.113)తో వెనకబడిపోయింది. దీంతో ఇది ఝార్ఖండ్ టీంకు కలిసి వచ్చింది. మంచి నెట్ రన్‌రేట్ ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన ఝార్ఖండ్ జట్టు మాత్రం ఫైనల్‌కు అర్హత సాధించింది. నిజానికి ఇది ఝార్ఖండ్‌కు మొదటి ఎస్‌ఎంఏటీ ఫైనల్ అర్హత. 2006 నుంచి ఈ టోర్నీ జరుగుతున్నా, ఇప్పటి వరకు ఈ టీం ఫైనల్ మ్యాచ్ ఆడలేదు.
Jharkhand led by Captain Ishan Kishan qualified for the finals of Syed Mushtaq Ali Trophy
Though their undefeated streak comes to an end today as they lost against Andhra Pradesh by 9 runs.#IshanKishan pic.twitter.com/1C6INYm9Gi
— Ayush (@AyushCricket32) December 16, 2025
Jharkhand led by Captain Ishan Kishan qualified for the finals of Syed Mushtaq Ali Trophy