Reading Time: < 1 minute
Election Commission Has Removed 58 Lakh Votes In Bengal

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముసాయిదా ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్‌లో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభించింది. ప్రత్యేక సర్వే ముగియడంతో మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ప్రత్యేక సర్వే తర్వాత బెంగాల్‌లో 58 లక్షలకు పైగా పేర్లు తొలగించబడినట్లు తెలిపింది. ఈ 58 లక్షల మంది జాడ లేదని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నేటి బంగారం ధరలు ఇలా..!

ఓటర్లు నమోదిత చిరునామాలో లేరని.. శాశ్వతంగా బదిలీ అవ్వడమో.. లేదంటే మరణించి ఉంటారని.. దీంతో 58 లక్షల మంది పేర్లు తొలగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం 7.66 కోట్లకు పైగా ఓటర్లు పరిగణనలో ఉన్నట్లు తెలిపింది. 7,66,37,529 మంది ఓటర్లు సవరణ డ్రైవ్ పరిధిలోకి వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. అక్టోబర్ 27న ఎన్నికల సంఘం ఓటర్ సవరణ షెడ్యూల్ ప్రకటించింది. అనంతరం నవంబర్ 4న SIR కసరత్తు ప్రారంభమైంది. ఇక తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 14న విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యంతరాలు, విచారణల ప్రక్రియ మాత్రం ఫిబ్రవరి, 2026 కొనసాగుతుందని ఈసీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Sydney Attack: ‘అహ్మద్ ఆస్ట్రేలియా హీరో’.. ఆస్పత్రిలో పరామర్శించిన ప్రధాని ఆంథోనీ

వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేపట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే మాదిరిగా సర్వే చేపట్టింది.