
ప్రముఖ నిర్మాత శ్రీనివాస కుమార్ అలియాస్ ఎస్కేఎన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లోనూ పనిచేశారు. అనంతరం ఎంతో మంది స్టార్ హీరోలు, పెద్ద సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు ఎస్కేఎన్. ఇదే క్రమంలో ‘ట్యాక్సీవాలా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘బేబీ’ సినిమాను నిర్మించి సోలో నిర్మాతగా అవతరించారు. ఇటీవల కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు ఎస్కేఎన్. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారీ స్టార్ ప్రొడ్యూసర్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా తాజాగా ఆయన ఒక టిఫిన్ సెంటర్ గురించి చెబుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ గా మారింది.
తాజాగా హైదరాబాద్ లోని ఓ చిన్న టిఫిన్ సెంటర్ కు వెళ్లి అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేశారు ఎస్కేఎన్. అనంతరం అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. ‘ 15 ఏళ్ల క్రితం మేము హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌కు కొత్తగా వచ్చినప్పుడు మాకు అత్యంత ఇష్టమైన టిఫిన్ స్పాట్ ఇది. ఇక ఇప్పటికీ అదే స్థలం, అదే రుచి, అదే వ్యక్తి ఉన్నారు. కాలం మారింది కానీ కొన్ని విషయాలు అస్సలు మారవు. కాలక్రమేణా ఈ చిన్న టిఫిన్ సెంటర్ చుట్టుపక్కల ఉండే అనేకమంది సినీ ప్రముఖులకు, దర్శకులకు, నిర్మాతలకూ ఫేవరెట్ అడ్డాగా మారింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్లు ఇక్కడే టిఫిన్లు తింటూ తమ సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇన్నేళ్లయినా ఈ చిన్న హోటల్ లో అదే క్వాలిటీ, అదే ఆప్యాయత అందుతోంది’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఎస్కేఎన్. ఇక ఈ పోస్టు చివరిలో టిఫిన్ సెంటర్ అడ్రస్ కూడా చెప్పారు. ‘ఆనంద్ టిఫిన్ సెంటర్, సాయిబాబా టెంపుల్ ఎదురుగా, ఫస్ట్ స్టేషన్ రోడ్, ఫిల్మ్ నగర్’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ ప్రొడ్యూసర్ గా మారి, వంద కోట్ల బడ్జెట్ సినిమాలు తీసే స్థాయికి వెళ్లినా ఎస్కేఎన్ తన మూలాలను, పాత జ్ఞాపకాలను మర్చిపోకపోవడం అభినందనీయమంటూ నెటిజన్లు ఈ నిర్మాతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
టిఫిన్ సెంటర్ లో నిర్మాత ఎస్కేఎన్..
15 years ago, when we were new to Hyderabad and Film Nagar, this was one of our favourite tiffin spots.
Same old spot. Same taste. Same person. Some things simply don’t change.
Over the years, this little place has been a favourite for many happening directors and producers… pic.twitter.com/1Pqbg6UTci
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
