
కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్నాలుగు రోజులు బంద్ఉంటుందని మార్కెట్ చైర్ పర్సన్ ప్రియాంక మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 11న అమావాస్య, 12, 13న వారాంత సెలవు, 14వ తేదీన వినాయక చవితి పండుగ వల్ల మార్కెట్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ నాలుగు రోజులు రైతుల తమ పంట ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురావొద్దని పేర్కొన్నారు. తిరిగి 15వ తేదీన మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని వెల్లడించారు.