Reading Time: < 1 minute

ఈశ్వర్ సాయిని 24 గంటల్లో అరెస్ట్ చేస్తాం.. ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ కు పోలీసుల హామీ

Caption of Image.

గండిపేట, వెలుగు: ఫోక్​డ్యాన్సర్ మాధురి రాథోడ్ సోమవారం నార్సింగి పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి, ఫోక్​డ్యాన్సర్​ఈశ్వర్ సాయిపై తాను గతంలో పెట్టిన కేసుకు సంబంధించి మరోసారి స్టేట్​మెంట్ ఇచ్చారు. కేసు నమోదై 16 రోజులు గడుస్తున్నప్పటికీ ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్టు చేయడం లేదని పోలీసులను ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. మాధురి రాథోడ్ స్టేట్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమోదు చేసుకున్న పోలీసులు, కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని చెప్పినట్లు తెలిసింది. ఈశ్వర్ సాయిని 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.   

©️ VIL Media Pvt Ltd.