
మాళవిక మోహనన్.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తనలోని యాంగిల్‌ను పూర్తిగా మార్చుకుంటోంది. ప్రస్తుతం కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’లో నటిస్తున్న ఈ భామ, యాక్షన్ సీక్వెన్స్‌లలో డూప్ (బాడీ డబుల్) లేకుండా నటించి చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచింది. సినిమా షూటింగ్ మొదటి రోజే ఏకంగా భారీ ఎత్తు నుంచి కిందకు దూకే యాక్షన్ సన్నివేశం అనగానే ఎవరైనా భయపడతారు. కానీ, మాళవిక మాత్రం తన కోసం తీసుకొచ్చిన స్టంట్ డబుల్‌ను వద్దని, స్వయంగా తానే ఆ సాహసం చేసి స్టంట్ మాస్టర్ దిలీప్‌ను సైతం అవాక్కయ్యేలా చేసినట్టు చెప్పుకొచ్చింది.
దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ‘సర్దార్ 2’ కోసం అదిరిపోయే యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. షూటింగ్ తొలి రోజే మాళవికకు ఒక భారీ జంప్ సీన్ ఇచ్చారు. రోప్‌ల సహాయంతో పైనుంచి స్విమ్మింగ్ పూల్‌లోకి డైవ్ చేయాలి. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి రిస్కీ షాట్స్ చేయడానికి జంకుతారు కాబట్టి డూప్‌ను రెడీగా ఉంచారు. కానీ చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ ఉండటంతో పాటు, ‘తంగలాన్’ సినిమా కోసం కర్రసాము (సిలంబం) నేర్చుకున్న మాళవిక.. ఈ స్టంట్‌ను ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకుంది. కింద నుంచి భారీ ఫ్యాన్లతో గాలి వస్తుండగా.. రోప్‌ల సాయంతో గాలిలో తేలుతూనే డైలాగ్స్ చెప్పడం, ముఖంలో ఏమాత్రం భయం కనిపించకుండా క్యారెక్టర్ తాలూకు స్వాగ్ మెయింటైన్ చేయడం ఎంతో కష్టమైనప్పటికీ పూర్తి డెడికేషన్‌తో ఆ సీన్ పూర్తి చేసింది. యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు కష్టపడుతున్నట్లు కాకుండా, అది మన బాడీ లాంగ్వేజ్‌లో భాగమైనట్లు ఎంతో అలవోకగా చేయాలని సీనియర్ నటుడు విక్రమ్ తనకు ఇచ్చిన సలహా ఎంతో ఉపయోగపడిందని ఆమె తెలిపింది.
ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఎస్.జె. సూర్య నటన చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని మాళవిక వెల్లడించింది. ఒక విలన్ పాత్రకు ఆయన తీసుకొచ్చే స్టైల్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటాయని, భవిష్యత్తులో అవకాశం వస్తే తాను కూడా అలాంటి పవర్‌ఫుల్ లేడీ విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమేనని సంచలన ప్రకటన చేసింది. ఇక హీరో కార్తి గురించి చెబుతూ.. ఆయన సెట్‌లో చాలా జోవియల్‌గా ఉంటారని, ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని ప్రశంసించింది. తెలుగు ప్రేక్షకులకు కార్తి ఒక దత్తపుత్రుడి లాంటి వాడని, క్యారెక్టర్లకు కనెక్ట్ అయితే ఇక్కడి ప్రేక్షకులు చూపించే ప్రేమ వెలకట్టలేనిదని ఆమె పేర్కొంది. గ్రాండ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందుతున్న ‘సర్దార్ 2’ కోసం బ్యాంకాక్‌లో భారీ ఫైట్ సీక్వెన్సులు చిత్రీకరించారు. ఇదొక విజువల్ వండర్‌గా ఉండబోతోందని, ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుందని మాళవిక భరోసా ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం తనకు చాలా ఇష్టమని చెబుతూ, సెప్టెంబర్ 10న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో థియేటర్లలో కలుద్దామని అభిమానులకు పిలుపునిచ్చింది.