Reading Time: < 1 minute

పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

Caption of Image.
  • ఈ నెల 16 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం
  • 7,437 పోస్టులకు ఇప్పటికే 3,38,336 అప్లికేషన్లు
  • గడువు పొడిగిస్తూ ప్రకటన చేసిన టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్పీఆర్బీ

హైదరాబాద్‌‌, వెలుగు: పోలీస్‌‌ సహా యూనిఫా మ్‌‌ సర్వీస్​ పోస్టులకు ఆన్‌‌లైన్‌‌ దరఖాస్తుల గడు వును సెప్టెంబర్‌‌ 16 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు (టీఎస్‌‌ఎల్పీఆర్బీ) చైర్మన్‌‌ వీవీ శ్రీనివాసరావు మంగళ వారం ప్రకటన రిలీజ్​ చేశారు. 

గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారంతో అప్లికేషన్లకు గడువు ముగియనుంది. అయితే, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు.

పోలీస్‌‌, స్పెషల్‌‌ ప్రొటెక్షన్‌‌ ఫోర్స్‌‌ (ఎస్పీఎఫ్‌‌), అగ్నిమాపక, విపత్తుల స్పందన, అత్యవసర సేవలు, సివిల్‌‌ డిఫెన్స్‌‌, జైళ్లు –కరెక్షనల్‌‌ సర్వీసెస్‌‌ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌‌ స్థాయిలో మొత్తం 7,437 పోస్టులకు ఇప్పటివరకు 3,38,336 మంది అభ్యర్థులు రిజిస్టర్‌‌ చేసుకున్నట్టు బోర్డు చైర్మన్‌‌ తెలిపారు.

రిజిస్టర్‌‌ అయిన అభ్యర్థుల్లో మహిళలు దాదాపు 25 % ఉన్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి రోజు వరకు వేచి చూడొద్దని, టెక్నికల్​సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. వీలైనంత త్వరగా దరఖాస్తులు పూర్తి చేయాలని ఆయన సూచించారు.

©️ VIL Media Pvt Ltd.