Reading Time: < 1 minute

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌: హైదరాబాద్‌ ‘NIAB’లో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడంటే?

Caption of Image.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 2 (సీనియర్ రీసెర్చ్ ఫెలో 1, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1).

విద్యార్హతలు
సీనియర్ రీసెర్చ్ ఫెలో: బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లేదా ఇమ్యునాలజీ విభాగాల్లో ఎంవీఎస్సీ, ఎం.టెక్ లేదా ఎంఎస్సీ  ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల పరిశోధన, అభివృద్ధి అనుభవం ఉండాలి. సెల్ కల్చర్, జంతువులపై ప్రయోగాలు, ఎలీసా/ ఫాక్స్ ఇమ్యునో అసే, మాలిక్యులర్ బయాలజీలో అనుభవం తప్పనిసరి.

సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్: ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. సమావేశాల నిర్వహణలో కనీసం ఐదేళ్ల అనుభవంతోపాటు సూపర్‌వైజరీ పనుల్లో తగినంత అనుభవం ఉండాలి.

వయసు: సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 35 ఏళ్లు, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్​కు 50 ఏళ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 9.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 23.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ niab.res.inను సందర్శించండి. 

►ALSO READ | మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులు.. ఎలాంటి పరీక్ష లేదు.. వివరాలు ఇవే!

©️ VIL Media Pvt Ltd.