Reading Time: < 1 minute

Physiotherapy : బోన్ ఫ్యాక్చర్లకు సర్జరీలతో సరిపోదు..మళ్లీ నడిపించే శక్తి ఫిజియోథెరపీ

Caption of Image.

సర్జరీలు, తీవ్రమైన గాయాలు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అనంతరం ఫిజియోథెరపి అందిస్తారు. ఇది శరీర భాగాలు తిరిగి సాధారణ స్థితికి రావడానికి , నొప్పులు తగ్గి, కదలికలు సులువుగా అవడానికి ఈ థెరపీ చాలా కీలకం. వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఫిజియోథెరపీ ప్రాముఖ్యత, ఏయే ట్రీట్ మెంట్స్ తర్వాత ఈ థెరపీ చేస్తారు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

ప్రధానంగా శరీరం కిందిభాగంలో చికిత్స తర్వాఫిజియోథెరపీ ఎంతో అవసరం. కీళ్లమార్పిడి, ఎముకల ఫ్యాక్చర్, వెన్నెముక సర్జరీ, పక్షవాతం,వెన్నెముక గాయాలు, గుండె ఆపరేషన్, బైపాస్ సర్జరీలు, లంగ్స్ సర్జరీల తర్వాత ఫిజియోథెరపీ చాలాముఖ్యం. 

క్యాన్సర్ సర్జరీల తర్వాత ,కీమోథెరపీ,రేడియేషన్ చికిత్సల తర్వాత వచ్చే నీరసం, కండరాల బలహీనత ,చేతులు, కాళ్లలో వచ్చే వాపులను తగ్గించేందుకు కూడా  ఈ థెరపీ ఉపయోగిస్తారు. ఈ విధంగా, మందులతో మాత్రమే నయం కానటువంటి శారీరక కదలికల లోపాలు,  శరీర దృఢత్వాన్ని తిరిగి పొందేందుకు ఫిజియోథెరపీ ఓ ముఖ్యమైన రిహాబిలిటేషన్ ట్రీట్ మెంట్ పనిచేస్తుంది. 

ఫిజియోథెరపీ రకాలు ..

ఫిజికల్ థెరపీ అనేది చేతులతో చేసే పద్ధతులు , ఫిజికల్ థెరపిస్ట్ పర్యవేక్షణలో మీరు చేసే వ్యాయామం. ఫిజికల్ థెరపీలో  సాగదీయడం, బరువులు, వ్యాయామ పరికరాలతో  శిక్షణ,మసాజ్, వేడి లేదా చల్లని చికిత్స,జలచికిత్స, ట్రాన్స్ క్యూటేనియన్ ఎలక్ట్రికల్ నెర్వ్ స్టిమ్యూలేషన్ (TENS) చికిత్స ఇలా ఆరు రకాల ఫిజియోథెరపీలను చికిత్స అనంతరం అందిస్తారు. 

ఫిజియో థెరపీని సాధారణంగా ఔట్ పేషెంట్లకు ఇస్తారు. దీనర్థం ఆస్పత్రిలో  ఆపరేషన్ తర్వాత ఆస్పత్రినుంచి ఇంటికి వెళ్లాక కొనసాగిస్తారు. అవసరమైన ఫిజికల్  థెరపీ రకాన్ని బట్టి ప్రత్యేక క్లినిక్ లు , ఆస్పత్రి లేదా ఇంట్లో కూడా చేయించుకోవచ్చు.  వర్చువల్ విజిట్ ద్వారా ఫిజికల్ థెరపీ చేయించుకోగలిగే అవకాశం కూడా ఉంటుంది. 

©️ VIL Media Pvt Ltd.