Reading Time: 2 minutes

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ జాతర.. గంటల్లోనే లక్ష డాలర్లను దాటిన ప్రీ-సేల్స్!

Caption of Image.

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ విడుదల ముందే బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  సినిమా థియేటర్లలోకి రావడానికి ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉండగానే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి

అమెరికాలో బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే  లక్ష డాలర్ల మార్కును దాటేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం ‘సినిమార్క్ థియేటర్ల నెట్‌వర్క్ నుంచే ఈ స్థాయి కలెక్షన్లు రావడం నాని ఓవర్సీస్ స్టామినాకు అద్దం పడుతోంది. దీంతో నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా ఈ స్థాయి ప్రీ సెల్స్ సాధించిన ఏకైక తెలుగు చిత్రంగా ‘ది ప్యారడైజ్’ ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. 

ఇప్పటికే సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు చిత్రబృందం సిద్ధమైంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. రక్తపాతం, తిరుగుబాటు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం వంటి అంశాలతో టీజర్ నాని పాత్రను అత్యంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేసింది. ముంబై స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని ‘జాదల్’గా కనిపించనున్నారు.

►ALSO READ | సెప్టెంబర్ 18న పిఠాపురంలో సినిమా విడుదల

 ఈ చిత్రంలో నాని క్యారెక్టరైజేషన్, రా అండ్ రస్టిక్ మేకింగ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నాయి. కాయదు లోహార్ కథానాయికగా నటిస్తుంది. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్ , సంపూర్ణేష్ బాబు వంటి ప్రముఖ నటులు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు.

ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రాబోయే రోజుల్లో ఇతర థియేటర్ చైన్స్, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో బుకింగ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఈ ప్రీ-సేల్స్ నంబర్లు ప్రీ-రిలీజ్ వేళకు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
 

 

©️ VIL Media Pvt Ltd.