Reading Time: 2 minutes

సంతాన వ్రతం: ఆడపిల్లలు కావలా.. మగపిల్లలు కావాలా..చేయాల్సినపూజ.. నైవేద్యాలు ఇవే..!

Caption of Image.

పెళ్లయి రెండు మూడు నెలలు అయిందో లేదో.. పిల్లలెప్పుడు అని పెద్దలు అడుగుతుంటారు.. మగ పిల్లాడా.. ఆడపిల్లా అని పెద్దలు అనేక ప్రశ్నలు వేస్తుంటారు.   పురాణాల ప్రకారం శ్రావణమాసం.. అమావాస్య రోజున సంతాన వ్రతాన్ని కొత్తగా పెళ్లైన మహిళే కాదు.. పిల్లలు ఉన్నవారు కూడా సంతానం అభివృద్దికి అమ్మవారిని పూజిస్తుంటారు.  మరి ఆడపిల్ల కావాలనుకొనే వారు అమ్మవారికి ఏం సమర్నించాలి.. మగ పిల్లాడు కావాలనుకొనే వారు ఏం నైవేద్యం పెట్టాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

శ్రావణమాసం 2026 సెప్టెంబర్​ 11తో  ముగియనుంది.  ఆగస్టు … శ్రావణమాసం అమావాస్య..  దీనినే సంతాన అమావాస్య.. పోలాల అమావాస్య అంటారు.   పురాణాల ప్రకారం ఈ శ్రావణ అమావాస్యరోజు అమ్మవారిని పూజిస్తూ సంతాన సౌభాగ్య వ్రతంచేయాలని పండితులు చెబుతున్నారు. 

పురాణాల ప్రకారం అనేక వ్రతాలు.. పూజలు.. నోములు చాలా ఉన్నాయి.  శ్రావణమాసంలో మహిళల సందడి అంతా ఇంతా కాదు.హిందూ పురాణాల  ప్రకారం మహిళలకు అనేక వ్రతాలు.. పూజలు ఉన్నాయి.  ముఖ్యంగా శ్రావణ మాసంలో అనేక వ్రతాలు ఉన్నాయి.  శ్రావణ అమావాస్య రోజు ( 2026ఆగస్టు 11) సంతానం కోసం.. పోలాల అమావాస్య వ్రతం చేస్తారు. 

పురాణాల ప్రకారం పోలాల అమావాస్యకు ఎంతో విశి ష్టత వుంది. ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంర క్షణ కోసం నిర్దేశించబడింది.  కొత్తగా వివాహమైనవారికి.. పెళ్లైన చాలా కాలానికి కూడా సంతానం కలుగని స్త్రీలకు పోలాల అమావాస్య ఎంత ముఖ్యమో… సంతానవంతులైన స్త్రీలకు కూడా అంతే ముఖ్యం. అందుకే స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు.

వ్రతం ఎలా చేయాలి … విధానం ఇదే..! 

 

  • శ్రావణమాస అమావాస్య రోజు ( 2026 ఆగస్టు11)  సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
  •  దేవుడి మందిరంలో ముగ్గులు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ పూజకు ఉండాల్సింది కంద మొక్క. 
  • దేవుడి మందిరం దగ్గర కంద మొక్కను ఉంచి దాని చుట్టూ పసుపు,కుంకుమ,బియ్యం పిండితో చుక్కలు పెట్టాలి. 
  • ఏడు పోచలు దారానికి పసుపు రాసి పసుపుకొమ్ము కట్టాలి. 
  •  ఇంట్లో ఎంత మంది మహిళలు వుంటే అన్ని అమ్మవారికి ఒకటి, వాయనం ఇచ్చే ముత్తైదువుకి ఒకటి చొప్పున తోరాలు తయారుచేసుకొని కంద మొక్క దగ్గర పెట్టాలి. 
  • మొదటగా పసుపు వినాయకుడిని పూజించి ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీదేవిని గానీ, సంతానలక్ష్మీదేవిని గానీ ఆవాహనం చేసుకొని షోడశోపచారాలతో శక్తి కొలది పూజచేయాలి.
  • నివేదనగా నవకాయ  (తొమ్మిది రకాల కాయ కూరలు కలిపి) కూర చేస్తారు. ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.

పూజ పూర్తి అయిన తర్వాత ఏడు బూరెలు (మగపిల్లలు కలవారు… మగసంతానం కావాలనుకునేవారు)… 
 ఏడు గారెలు (ఆడపిల్లలు ఉన్నవారు, ఆడ సంతానం కావాలనుకునేవారు) నైవేద్యం పెట్టాలి

  • కథ చెప్పుకుని అక్షింతలు వేసు కోవాలి. ఏడు బూరెలు, ఏడు గారెలు దక్షిణ వేసి బహు సంతానవతి అయిన ముత్తై దువుకి వాయనం ఇచ్చి ( ఆచారం ఉంటేనే), పసుపుకొమ్ము కట్టిన తోరాన్ని ఇచ్చి నమస్కరించి అక్షింత లు వేయించుకోవాలి. 
  • ఒక పసుపుకొమ్ము తోరాన్ని అమ్మవారికి వుంచి, మిగిలినవి తీసి పూజ చేసుకున్నవారు మెడలో వేసుకోవాలి. పిల్లలకు కూడా కథ అక్షింతలు వేసి పసుపు కొమ్ము కట్టిన తోరాన్ని మెడలో వేయాలి. 
  • ఇలాచేస్తే మంచి జరుగుతుం దని, సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పదికాలాలపాటు చల్లగా ఉంటుందని పండితులు చెబుతున్నారు
  •  సాయంత్రం కూడా అమ్మవారి దగ్గర దీపం వెలిగించాలి. పూర్ణం బూరె లు, గారెలు లాగే పోలేరమ్మకు పనస ఆకు లతో బుట్టలు కుట్టి  అందులో ఇడ్లీ పిండి  నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.

ALSO READ : పోలాల అమావాస్య.. సంతాన సౌభాగ్య వ్రతం.. కందమొక్కకు పూజ..ఏ రోజు చేయాలంటే.!

పూర్ణంబూరెలు వాయనంగా ఎందుకు ఇవ్వాలి అనే విషయంలో  కూడా ఒక శాస్త్రీయ కోణం ఉంది. పురాణాల ప్రభావం  పూర్ణంబూరె..  పూర్ణగర్భానికి చిహ్నమని పెద్దలు చెబుతుంటారు. అందులోని పూర్ణం గర్భస్థశిశువుకు చిహ్నమని.. . స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది. కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు.ఇలా చేయడం వలన సంతానం వృద్ది చెందుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.