Reading Time: < 1 minute

అమెరికన్ మ్యాథ్యూ వాన్ డైక్ కేసులో ట్విస్ట్.. UAPA తొలగించిన ఎన్ఐఏ

Caption of Image.

మయన్మార్‌లో భారత్ వ్యతిరేక సాయుధ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారనే ఆరోపణలతో మార్చిలో అరెస్టైన అమెరికన్ మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్‌, ఆరుగురు ఉక్రెయిన్ జాతీయుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదట వీరిపై ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసిన ఎన్ఐఏ.. తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఆ చట్టాన్ని ఉపసంహరించుకుంది. 

ఉపా చట్టానికి బదులుగా ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టాల కిందఅభియోగాలు నమోదు చేసింది. అంటే ప్రస్తుతం కేసు ప్రధానంగా భారత్ లో విదేశీయుల ప్రవేశం, ప్రయాణం, నివాస రూల్స్ ఉల్లంఘనలపై కొనసాగుతోంది.

ఎన్ఐఏ వివరాల ప్రకారం..వాన్‌డైక్‌ బృందం టూరిస్టు వీసాలతో భారత్‌లోకి వచ్చి, మిజోరం ద్వారా మయన్మార్‌లోకి ప్రవేశించింది. అక్కడ 2021 నుంచి మయన్మార్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సాయుధ పోరాట బృందాలతో సంబంధాలు పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. 

ALSO READ : సత్య నికేతన్ ఘటన: చదువులు ఆగినా ఫర్వాలేదు.. 

ఇదిలా ఉంటే.. యూరప్ నుంచి భారత్ మీదుగా మయన్మార్‌కు భారీ సంఖ్యలో డ్రోన్లు తరలించినట్లు కూడా ఎన్ఐఏ ఆరోపించింది. ఇటీవల మయన్మార్‌లో జరిగిన పౌర విమానంపై డ్రోన్ దాడితో ఈ బృందానికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.

ఈ కేసు తదుపరి విచారణను ఢిల్లీ కోర్టు అక్టోబర్ 1కి వాయిదా వేసింది.

©️ VIL Media Pvt Ltd.