
సౌత్ ఇండియన్ సినిమా ప్రస్తుతం కొత్త తరం హీరోయిన్లతో కళకళలాడుతోంది. మమిత బైజు, కాయదు లోహర్, భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్, ప్రీతి ముకుందన్ అనే ఐదుగురు యువ నటీమణులు భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్రసీమల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ, అగ్ర తారల సరసన అవకాశాలు దక్కించుకుంటున్నారు.ఈ మధ్యనే యారో సినిమాతో హిట్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే, తమిళంలో శివకార్తికేయన్‌తో కలిసి సేయాన్లో నటిస్తున్నారు. తాజాగా మోహన్‌లాల్ ఆపరేషన్ గంగతో మలయాళంలో అరంగేట్రం చేస్తున్నారు. రుక్మిణీ వసంత్ తెలుగులో ఎన్టీఆర్‌తో డ్రాగన్లో నటిస్తూనే, తమిళంలో రజనీకాంత్ ధర్మన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే, మలయాళంలో నివిన్ పౌలీ 51వ సినిమాకు ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు.కాయదు లోహర్ అయితే సౌత్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. ఇమ్మోర్టల్, ఐ యామ్ గేమ్ సినిమాలతో వచ్చిన ఈమె, తెలుగులో నానితో ప్యారడైజ్ చేస్తూనే, తమిళంలో సూర్య 48లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మలయాళంలో తారం సినిమాలో నటిస్తున్నారు. క్యూట్ బ్యూటీ మమిత బైజు తెలుగులో స్ట్రెయిట్ సినిమా ఆఫర్ కోసం ఎదురు చూస్తూనే, తమిళంలో రెండు, మలయాళంలో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ముస్తాబైన ఖైరతాబాద్ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా
పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?