Reading Time: 3 minutes
Vijay Deverakonda: డైరెక్టర్‌పై కొండంత ప్రేమ.. సందీప్ రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ మూవీతో దర్శకుడిగా సెన్సేషన్ అయ్యారు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా వీరిద్దరి కెరీర్ లను మలుపు తిప్పడమే కాకుండా వారిద్దరి మధ్య మంచి బాండింగ్ క్రియేట్ చేసింది. సందీప్ రెడ్డి వంగాపై తనకున్న అభిమానాన్ని, ప్రేమను ఇదివరకు పలు సందర్భాల్లో బయటపెట్టారు విజయ్. నిజానికి అర్జున్ రెడ్డి చిత్రం వీరిద్దరి మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరచింది. అయితే సాధారణంగా విజయ్ తనకు అత్యంత సన్నిహితులైనవారికి, స్నేహితులకు ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ గిఫ్టులు ఇస్తూనే ఉంటారు. తాజాగా తనకు ఇష్టమైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా ఎపిక్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే మంగళవారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వేడుకకు విజయ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. సందీప్ రెడ్డి సైతం విచ్చేశారు. అయితే ఈ వేడుకలో విజయ్ డైరెక్టర్ సందీప్ రెడ్డికి ఖరీదైన వాచ్ బహుకరించారు. విజయ్ ప్రేమతో ఇచ్చిన ఆ బహుతిని సందీప్ వెంటనే తన చేతికి ధరించారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. వీరిద్దరి బాండింగ్ చూసిన నెటిజన్స్ మురిసిపోతున్నారు. విజయ్ దేవరకొండ మనసు బంగారం.. సందీప్ అంటే కొండంత ప్రేమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

సందీప్ రెడ్డికి విజయ్ గిఫ్ట్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..