
ప్రధాని మోదీ సభలో ఫేక్ పీఎంఓ ఐడీలు కలకలం రేపాయి. పీఎంఓ ఇస్యూ చేసినట్లు కనిపిస్తున్న నకిలీ గుర్తింపు కార్డులతో ఇద్దరు దుండగులు సభలోకి ప్రవేశించారు. వారి దగ్గర గన్స్ కూడా ఉన్నట్లు భద్రతా సెక్యూరిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. అగంతులను అదుపులోకి తీసుకుని గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో బీకేసీలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు.
మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) లో ప్రధాని మోదీ హాజరుకావాల్సిన ఒక ఈవెంట్‌కు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2026 ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ఇక్కడికి వస్తున్న క్రమంలో నకిలీ ఐడీ కార్డుతో లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులలో ఒకరిని 24 ఏళ్ల రోహన్ పరేఖ్ గా గుర్తించారు. ప్రధాని కార్యాలయంలో అధికారిని అని చెప్పుకుంటూ ఫేక్ ఐడీ కార్డును చూపించి లోనికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుడు రోహన్ తోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. రెండో నిందితుని దగ్గర గన్ ఉన్నట్లు సెక్యూరిటీ చెక్ చేయగా నకిలీ ఐడీ కార్డులబాగోతం బయటపడింది. నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో వీరిని హాజరుపరచనున్నారు.
మోదీ ముంబైలోని నిర్వహిస్తున్న ఈ వేదికపై ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ , టెక్నికల్ సదస్సులలో ఒకటైన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 7వ ఎడిషన్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఈ ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.