
India 30 Plus XI vs India Under 25 XI: భారత్ క్రికెట్‌లో సీనియర్లు, జూనియర్లు ఎదురెదురుగా నిలిస్తే పోరు ఎలా ఉంటుందో ఊహించండి. ఒకవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలాంటి 30-ప్లస్ సీనియర్లు.. మరోవైపు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్ వంటి యువకులు. ఇలా ఈ రెండు జట్లు పోటీ పడితే ఎవరిది పైచేయి అన్నది తెలుసుకోవాలని ఉందా..? అసలు ఈ పోరు ఎలా ఉంటుంది, ఈ రెండు జట్లలో ఎవరెవరు ఉన్నారో ఓసారి చూద్దాం..!
క్రిక్‌ట్రాకర్ ఈ రెండు జట్లను రూపొందించింది. ఇందులో ఓ టీంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లతో కూడిన 30 ప్లస్ ప్లేయింగ్ 11 ఉండగా.. మరో టీంలో యువకులతో నిండిన అండర్ 25 ప్లేయింగ్ 11 టీంను రూపొందించారు. ఈ రెండు జట్లు ఎదురెదురుగా నిలిస్తే ఎవరిది పైచేయి? ఇదే ఆసక్తికరమైన క్రికెట్ పోలిక. ఒక జట్టులో అనుభవం, మరో జట్టులో యువ ఉత్సాహం కనిపిస్తోంది.
అనుభవజ్ఞుల బ్యాటింగ్ బలం..
30-ప్లస్ ప్లేయింగ్ XI బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. వీరికి హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా కూడా తోడవుతున్నారు. కీలక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొన్న అనుభవం ఉన్న ఆటగాళ్లతో ఈ లైనప్ బలంగా కనిపిస్తోంది.
యువ బ్యాటర్ల దూకుడు..
అండర్-25 XIలో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, అంగ్క్రిష్ రఘువంశీ, తిలక్ వర్మ ముందంజలో ఉన్నారు. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.
బౌలింగ్‌లో సీనియర్ల పంచ్..
30-ప్లస్ ప్లేయింగ్ XI బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. మరోవైపు యువ జట్టులో మానవ్ సుతార్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ వంటి బౌలింగ్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి.
అసలు పోటీ ఎక్కడ..?
ఈ పోలికలో సీనియర్ జట్టుకు అంతర్జాతీయ అనుభవం పెద్ద బలం కాగా, అండర్-25 ప్లేయింగ్ XIలోని యువ ఆటగాళ్ల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోహిత్, కోహ్లీ, బుమ్రా వంటి పేర్లతో కూడిన ప్లేయింగ్ XIనా, లేక కొత్త తరం వైభవ్, యశస్వి, తిలక్, మయాంక్‌ల XIనా? ఈ రెండు జట్లు నిజంగా తలపడితే ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం మీ ఊహకే వదిలేస్తున్నాం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..