Reading Time: 2 minutes

చైనా డ్యాన్సర్ దెబ్బకు ఇంటర్నెట్ షేక్.. 20 ఏళ్ల తర్వాత ప్రభాస్ పాటకు గ్లోబల్ క్రేజ్!

Caption of Image.

రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆయన నటించిన ఓ 20 ఏళ్ల నాటి చిత్రంలోని పాట ఇప్పుడు అనూహ్యంగా గ్లోబల్ లెవల్‌లో సెన్సేషన్‌గా మారింది. ప్రభాస్, త్రిష, ఛార్మీ కౌర్ నటించిన మూవీ’పౌర్ణమి’ . ఈ సినిమాలో ‘భరత వేదముగ’ సాంగ్ కు  చైనాకు చెందిన డ్యాన్సర్ మీరా వాంగ్ చేసిన క్లాసికల్ డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె హావభావాలు, నాట్య భంగిమలు చూసి తెలుగు ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

2006లో విడుదలైన ‘పౌర్ణమి’కి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోయినా.. సినిమాకు సంబంధించిన పాటలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ముఖ్యంగా ‘భరత వేదముగ’  సాంగ్ కు ఛార్మి చేసిన క్లాసికల్ డ్యాన్స్  ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. థియేటర్లు  క్లాప్స్, ఈలలతో మార్మోగిపోయింది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, కేఎస్ చిత్ర ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను చంద్రకౌన్స్ రాగంలో రూపొందించడం మరో ప్రత్యేకత. .

ALSO READ : మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు ఏపీలో కీలక పదవి..

ఇక చైనా డ్యాన్సర్ మీరా వాంగ్ విషయానికి వస్తే.. భారతదేశానికి ఇప్పటివరకు రాకపోయినా కూచిపూడిపై ఆమెకు ఏర్పడిన మక్కువ మాత్రం అబ్బురపరుస్తోంది. అనంతపురానికి చెందిన ఆల వెంకటగోపాల్ తన కూచిపూడి గురువుగా ఆమె పేర్కొంటున్నారు. తెలుగు సినిమా పాటలకు క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ తన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ‘మాయాబజార్’లోని ‘ఆహా నా పెళ్లంట’ వంటి క్లాసిక్ పాటలకూ ఆమె నృత్యం చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meerawang (@meera_kaurwaki)

ప్రభాస్, త్రిష, ఛార్మి ప్రధాన పాత్రల్లో నటించిన ‘పౌర్ణమి’కి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. కథలో కూచిపూడి, సంప్రదాయ కళలు కీలక నేపథ్యంగా నిలిచాయి. ఒకప్పుడు థియేటర్లలో ఓ మోస్తరు ఫలితాన్నే అందుకున్న సినిమా.. రెండు దశాబ్దాల తర్వాత ఓ పాట కారణంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం నిజంగా టాలీవుడ్ మ్యాజిక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ చైనా గర్ల్ చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియోకు భారతీయులు ఫిదా అవుతూ కామెంట్ల వర్షంతో ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.