
Tata Nexon: టాటా మోటార్స్ కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. కంపెనీ ఈ నెలలో అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లను వెల్లడించింది. ఇందులో టాటా కర్వ్ తర్వాత టాటా నెక్సాన్‌పై అత్యధిక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. నెక్సాన్ కొనుగోలుపై గరిష్ఠంగా రూ.75,000 వరకు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
రూ.75 వేల వరకు ప్రయోజనాలు..
సెప్టెంబర్ 2026లో టాటా నెక్సాన్ పెట్రోల్-మాన్యువల్ వేరియంట్లలో ఎంపిక చేసిన ట్రిమ్‌లపై రూ.75,000 వరకు ఆఫర్లు అందిస్తున్నారు. స్మార్ట్+, స్మార్ట్+ S, పూర్, పూర్ S, పూర్+, పూర్+ S, పూర్+ PS వేరియంట్లపై ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ రూ.75,000 ఆఫర్‌లో రూ.10,000 డిస్కౌంట్, రూ.45,000 ఇంటర్వెన్షన్ ఆఫర్, రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. పాత కారును స్క్రాప్ చేయడం ద్వారా అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
పెట్రోల్ వేరియంట్లపై రూ.55 వేల వరకు..
నెక్సాన్ ఇతర పెట్రోల్ వేరియంట్లను కొనుగోలు చేసే వారికి కూడా కంపెనీ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.55,000 వరకు ఆదా చేయవచ్చు. ఇందులో రూ.10,000 డిస్కౌంట్, రూ.25,000 ఇంటర్వెన్షన్ ఆఫర్, రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.
CNGపై రూ.60 వేల ప్రయోజనాలు..
తక్కువ రన్నింగ్ కాస్ట్ కోరుకునే వినియోగదారుల కోసం నెక్సాన్ CNG వేరియంట్‌పై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. నెక్సాన్ CNGపై రూ.60,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ.10,000 డిస్కౌంట్, రూ.25,000 ఇంటర్వెన్షన్ ఆఫర్, రూ.25,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. ఇక నెక్సాన్ డీజిల్ వేరియంట్లపై రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్లు వేరియంట్, డీలర్, నగరం వంటి అంశాలను బట్టి మారే అవకాశం ఉంది.
ఫీచర్ల పరంగా కూడా నెక్సాన్ మంచి ప్యాకేజీని అందిస్తోంది. వేరియంట్‌ను బట్టి 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు పానరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో-డిమ్మింగ్ IRVM, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.