
మనం ఎప్పుడైనా కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు, కారు ఎంత స్పీడ్ గా వెళుతుందనే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ, మన కారు టైర్లు అంత స్పీడ్ తట్టుకోగలవా..? అనే విషయాన్ని మాత్రం చాలామంది పట్టించుకోరు. ఇదే టైర్ల విషయంలో చాలా ముఖ్యం. దీని గురించే ‘టైర్ స్పీడ్ రేటింగ్’ అంటారు….
1. టైరు సైజులో అ అక్షరం అర్థం ఏమిటి?
కారు టైరు పక్క భాగంలో కొన్ని నంబర్లు, అక్షరాలు రాసి ఉంటాయి. ఉదాహరణకు: 195/55 R16 87V అని అనుకుందాం…. ఇందులో వెడల్పు, ఎత్తు, రిమ్ సైజ్ గురించి అందరికీ తెలిసిందే. కానీ చివర ఉన్న ‘V’ అనే అక్షరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఉదాహరణలో ‘V’ అంటే ఆ టైరు గంటకు గరిష్టంగా 240 కిలోమీటర్ల స్పీడ్ తట్టుకోగలదని అర్థం.
2. స్పీడ్ రేటింగ్ ఎలా ఇస్తారు?
కంపెనీలు టైర్లను తయారు చేసేటప్పుడు లాబొరేటరీలలో రకరకాల పరీక్షలు చేస్తాయి. టైరు ఎంత స్పీడ్ తట్టుకోగలదో నిపుణులు పరిశోధించి ఈ రేటింగ్ ఇస్తారు. అయితే, ఈ స్పీడ్ లిమిట్ ఎప్పుడు వర్తిస్తుంది అంటే:
*టైరులో సరిపడా గాలి ఉన్నప్పుడు.
*టైరు మీద అదనపు బరువు లేనప్పుడు.
*టైరుకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే.
ఒకవేళ మీ బండి టైరు ఎప్పుడైనా పంచ్చరై రిపేర్ చేయించుకున్నా, లేదా డ్యామేజ్ జరిగిన… దాని అసలు స్పీడ్ సామర్థ్యం (Speed Rating) తగ్గిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ALSO READ : అమెరికా ఆంక్షల మధ్య బ్రిక్స్ సదస్సు..మోదీ, పుతిన్ కీలక భేటీ!..
3. టైర్ స్పీడ్ రేటింగ్ లిస్ట్
మీ టైరు మీద ఉన్న అక్షరం బట్టి ఎంత వేగంతో వెళ్లగలదో కింద ఇచ్చిన లిస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు:
A1 నుండి A8 వరకు: గంటకు 5 నుండి 40 కి.మీ. స్పీడ్ (ఇవి సాధారణ కార్లకు కాకుండా చిన్న చిన్న వాహనాలకు ఉంటాయి).
B: గంటకు 50 కి.మీ.
C: గంటకు 60 కి.మీ.
D: గంటకు 65 కి.మీ.
E: గంటకు 70 కి.మీ.
F: గంటకు 80 కి.మీ.
G: గంటకు 90 కి.మీ.
J: గంటకు 100 కి.మీ.
K: గంటకు 110 కి.మీ.
L: గంటకు 120 కి.మీ.
M: గంటకు 130 కి.మీ.
N: గంటకు 140 కి.మీ.
P: గంటకు 150 కి.మీ.
Q: గంటకు 160 కి.మీ.
R: గంటకు 170 కి.మీ.
S: గంటకు 180 కి.మీ.
T: గంటకు 190 కి.మీ.
U: గంటకు 200 కి.మీ.
H: గంటకు 210 కి.మీ.
V: గంటకు 240 కి.మీ.
W: గంటకు 270 కి.మీ.
Y: గంటకు 300 కి.మీ.
VR / ZR: గంటకు 210 లేదా 240 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో వెళ్లే స్పోర్ట్స్ కార్ల టైర్లు ఇవి.
మీ కారు టైర్ల స్పీడ్ రేటింగ్ గురించి తెలుసుకోవడం కేవలం మన సేఫ్టీ కోసమే కాదు, ప్రయాణాన్ని సురక్షితంగా సాగించడానికి కూడా చాలా ముఖ్యం. కాబట్టి, ఎప్పుడైనా మీరు మీ కారు లేదా బైక్ కోసం కొత్త టైర్లు కొనేటప్పుడు ఈ స్పీడ్ రేటింగ్ చూసి మీ డ్రైవింగ్ పద్ధతికి సరిపోయే బెస్ట్ టైర్లను తీసుకోండి.