
హార్ముజ్ జలసంధిలో అమెరికాతో యుద్దం కొనసాగుతున్న క్రమంలో ఇరాన్ ఆర్మీకీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అండర్ వాటర్ డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది.అమెరికాకు చెందిన డైవ్-ఎల్‌డీ అని పిలిచే అండర్‌వాటర్ డ్రోన్ ను తమ నిఘా వ్యవస్థ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.అయితే ఇరాన్ ప్రకటనను పెంటగాన్ కొట్టిపారేసింది.
హార్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అండర్ వాటర్ డ్రోన్ కనిపించకుండా పోయినది వాస్తవమే. ఆ డ్రోన్ చాలా పాతది, అందులో ఎటువంటి లేటెస్ట్ రాడార్ ఇతర కీలకమైన పరికరాలు ఏమీ లేవని పెంటగాన్ తెలిపింది. పైగా తామే ఐదు ఇరానియన్ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేశామనివెల్లడించింది.
ఇరాన్ అధికారిక మీడియా సేపా న్యూస్ ద్వారా అమెరికాకు చెందిన డైవ్-ఎల్‌డీ అని పిలిచే అండర్‌వాటర్ డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు నౌకాదళం IRGC ప్రకటించింది. ఇదే విషయంపై పెంటగాన్ అధికారి మాట్లాడుతూ.. ఆ డ్రోన్ హార్ముజ్ జలాలను సర్వే చేస్తున్న సమయంలో మాల్‌ఫంక్షన్ అయిందని, సున్నితమైన సోనార్ లేదా రాడార్ పరికరాలు ఏవీ లేవని చెప్పారు. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్నదే అమెరిక డ్రోన్ అని పెంటగాన్ ధృవీకరించలేదు.
డైవ్-ఎల్‌డీ డ్రోన్ గురించి..
Anduril సంస్థ అభివృద్ధి చేసిన డైవ్-ఎల్‌డీ, 10 రోజుల వరకు స్వతహాగా సముద్రంలో ఉండగలదు.సుమారు 6వేల మీటర్ల లోతుకు వెళ్ళగలదు. DefenseScoop 2024లో రిపోర్టుల ప్రకారం ప్రతి యూనిట్ ధర దాదాపు 2.5 మిలియన్ డాలర్లు. అమెరికా సైనిక చర్యలు
US సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, IRGC రెండు రోజుల వ్యవధిలో అమెరికా యుద్ధ నౌకపై రెండుసార్లు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన అనంతరం అమెరికా ఐదు ఇరానియన్ ముడి చమురు ట్యాంకర్లను నాశనం చేసింది.CENTCOM ఈ వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఆర్థిక ఆంక్షలు
27 ఇరానియన్ విమానయాన సంస్థలను అమెరికా ట్రెజరీ విభాగం స్పెషల్ డిసిగ్నేటెడ్ నేషనల్ లిస్టులో చేర్చింది. ఇరాన్ వాణిజ్య విమానయాన సంస్థలు చాలా కాలంగా ఇరానియన్ పాలకులకు మద్దతు ఇస్తున్నాయి” అని ట్రెజరీ పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ఇరాన్ అద్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికాపై తీవ్రఆరోపణలు చేశారు. తమ దేశం యుద్దానికి వ్యతిరేకమని.. దురాక్రమణదారులు దాడిచేస్తే ప్రశ్చాత్తాపపడేవరకు ప్రతిఘటిస్తామని అన్నారు. హర్మజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో ఇరుదేశాల నేతలు మాటల యుద్దం కొనసాగుతుండటంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి