
Xiaomi SkyNomad: ఫాల్ ఫ్లాగ్‌షిప్ లాంచ్ ఈవెంట్‌లో షియోమీ కొత్తగా Xiaomi SkyNomad SUV సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ కున్‌లున్ ప్లాట్‌ఫారమ్,, టెక్నికల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్‌లో N70 Pro, N70 Max, N90 Max, N90 Max Studio అనే నాలుగు మోడళ్లను తీసుకొచ్చింది. వీటిలో ఐదు సీట్ల N70 సిరీస్‌తో పాటు ఏడు సీట్ల N90 Max, క్యాంపింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన N90 Max స్టూడియోలు ఉన్నాయి.
ప్రీమియం 5-సీటర్ SUV Xiaomi N70:
Xiaomi N70 పొడవు 4,960 మి.మీ., వెడల్పు 1,998 మి.మీ., వీల్‌బేస్ 2,950 మి.మీ.గా ఉంది. బాక్సీ డిజైన్‌తో వచ్చిన ఈ SUVలో డ్రాగన్‌ఫ్లై హెడ్‌ల్యాంప్స్, ఇన్‌వర్టెడ్-U ఆకారపు టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. హెడ్‌ల్యాంప్స్ 624 మీ. వరకు హై-బీమ్ రేంజ్, 180 డిగ్రీల లో-బీమ్ కవరేజీని అందిస్తాయి. ఈ కారు వ్యాలీ బ్లూ, మౌంటెన్ గ్రీన్, పెర్ల్ వైట్, వోల్కానిక్ గ్రే, అబ్సిడియన్ బ్లాక్, లైట్ ఖాకీ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
N70 ఇంటీరియర్‌లో క్యాబినెట్-స్టైల్ సెంటర్ కన్సోల్, స్లైడింగ్ సెంటర్ కన్సోల్‌తో పాటు 33 వరకు స్టోరేజ్ కంపార్ట్‌మెంట్లను అందించారు. 1,530mm వెడల్పైన డ్యాష్‌బోర్డ్ డిస్‌ప్లే, 6.14 చదరపు మీటర్ల గ్లాస్ ఏరియా, 256 కలర్ యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. క్యాబిన్‌లో ఎక్కువగా టచ్ చేసే ఉపరితలాల్లో 95 శాతం సాఫ్ట్ మెటీరియల్‌తో కవర్ చేసినట్లు Xiaomi తెలిపింది. అలాగే OEKO-TEX సర్టిఫైడ్ మెటీరియల్స్‌ను ఉపయోగించారు. హీట్ పంప్ ఏసీ, ప్రత్యేక B-పిల్లర్ రియర్ వెంట్స్, 15-లేయర్ ఫ్రంట్ సీట్‌బ్యాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంకా ఇందులో 5 ఎక్స్‌ట్రా-లాంగ్ స్లైడింగ్ రైల్స్ ఉన్నాయి. వీటిలో పొడవైన రైల్ 1.56 మీటర్లుగా ఉంటుంది. రెండో వరుస సీట్లను 600 మిల్లీమీటర్ల వరకు స్లైడ్ చేసుకోవచ్చు. రెండో వరుసలో 1,010mm లెగ్‌రూమ్, 1,021mm హెడ్‌రూమ్ లభిస్తాయి. గరిష్ఠ రియర్ లెగ్‌రూమ్ 1,410mm వరకు ఉంటుంది. బూట్ కెపాసిటీ 1,203 లీటర్లు కాగా, సీట్లను మడిస్తే 2,425 లీటర్లకు పెంచుకోవచ్చు. వెనుక డోర్లు సుమారు 90 డిగ్రీల వరకు తెరుచుకుంటాయి. ఫ్రంట్ సీట్లలో హీటింగ్, వెంటిలేషన్, 16-పాయింట్ మసాజ్ ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. జీరో-గ్రావిటీ, రొటేటింగ్ సీట్లు ఆప్షన్‌గా లభిస్తాయి. 9 లీటర్ల రిఫ్రిజిరేటర్ హీటింగ్, కూలింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. వెనుక ప్రయాణికుల కోసం 21.4 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ కూడా ఉంది.
మరోవైపు ఇందులో 14-స్పీకర్ ఆడియో సిస్టమ్, 200mm సబ్‌వూఫర్, రెండు హెడ్‌రెస్ట్ స్పీకర్లు ఉన్నాయి. N70 Maxలో మాత్రం Xiaomi Astral Sound సిస్టమ్‌ను అందించారు. ఇందులో 25 స్పీకర్లు, 7.1.4 ఛానెల్స్, 4,890W పీక్ అవుట్‌పుట్, ఏడు టైటానియం-డోమ్ ట్వీటర్లు ఉన్నాయి.
N70 Pro, N70 Max:
N70 Proలో 52kWh LFP Xiaomi ఆర్మర్ స్కేల్ బ్యాటరీ, ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది CLTC ప్రకారం 351 కి.మీ EV రేంజ్, 1,351 కి.మీ కంబైన్డ్ రేంజ్ అందిస్తుంది. 0-100 కి.మీ వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుంది. అలాగే N70 Maxలో 76kWh టెర్నరీ లిథియం బ్యాటరీ, డ్యూయల్-మోటార్ AWD సెటప్ ఉన్నాయి. ఇది 505 కి.మీ CLTC EV రేంజ్, 1,461 కి.మీ కంబైన్డ్ రేంజ్ ఇస్తుంది. 0-100 కి.మీ వేగాన్ని కేవలం 5.5 సెకన్లలో అందుకుంటుంది. 20 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ కేవలం 18 నిమిషాల్లో పూర్తవుతుందని Xiaomi తెలిపింది.
N70లో డబుల్-విష్‌బోన్ ఫ్రంట్, ఇంటిగ్రేటెడ్ మల్టీ-లింక్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. N70 Maxలో ఐదు-స్థాయి అడ్జస్టబుల్ ఎయిర్ సస్పెన్షన్, కంటిన్యూయస్ వేరియబుల్ డ్యాంపింగ్ లభిస్తాయి. Xiaomi Super EEA, 3rd Gen Snapdragon 8 మొబైల్ ప్లాట్‌ఫామ్, NVIDIA Thor-U assisted-driving చిప్‌ను ఇందులో ఉపయోగించారు. Thor-U చిప్ 700 TOPS AI కంప్యూటింగ్ పవర్‌ను అందిస్తుంది. LiDAR, 4D మిల్లీమీటర్-వేవ్ రాడార్ కూడా ఉన్నాయి.
AEB, AES సహా 25 స్టాండర్డ్ సేఫ్టీ అసిస్టెన్స్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. AES వరుసగా రెండు ఎమర్జెన్సీ ఎవేజివ్ మానీవర్లను సపోర్ట్ చేస్తుంది. Hyper XiaoAi ద్వారా 95 శాతానికి పైగా వాహన నియంత్రణలను వాయిస్ కమాండ్లతో నిర్వహించవచ్చు. N70 బాడీలో హై-స్ట్రెంగ్త్ స్టీల్, అల్యూమినియం కలిపి 91.3 శాతం వరకు ఉపయోగించారు. 14 ప్రాంతాల్లో 2,200MPa అల్ట్రా-హై-స్ట్రెంగ్త్ స్టీల్‌ను ఉపయోగించారు. ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్స్, 9 కొలిజన్ సెన్సర్లు, ట్రిపుల్-రిడండెంట్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. SUV 650mm వరకు వాటర్ వాడింగ్‌ను తట్టుకోగలదు. అత్యవసర పరిస్థితుల్లో వాహనం నుంచి బయటపడేందుకు ఎమర్జెన్సీ ఫ్లోటింగ్ ఎస్కేప్ ఫీచర్ కూడా ఉంది.
7-సీటర్ SUV Xiaomi N90 Max:
N90 Max పొడవు 5,285mm, వెడల్పు 1,998mm, వీల్‌బేస్ 3,080mm. ఇందులో 2+2+3 సీటింగ్ లేఅవుట్ ఉంది. మొదటి, రెండో వరుసల్లో జీరో-గ్రావిటీ సీట్లు ఆప్షన్‌గా లభిస్తాయి. రెండో వరుసలో 950mm లెగ్‌రూమ్, మూడో వరుసలో 890mm లెగ్‌రూమ్, 962mm హెడ్‌రూమ్ ఉన్నాయి. మూడో వరుసలో ముగ్గురు పెద్దలు కూర్చునేంత స్థలం ఉంటుంది. ఈ SUVలో 76kWh టెర్నరీ లిథియం బ్యాటరీ, డ్యూయల్-మోటార్ AWD ఉన్నాయి. ఇది 464 కి.మీ CLTC EV రేంజ్, ఏకంగా 1,705 కి.మీ కంబైన్డ్ రేంజ్ అందిస్తుంది. 0-100 కి.మీ వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ఠ వేగం 190 కి.మీ/గంట.
N90 Maxలో 16.1 అంగుళాల 3K సెంట్రల్ డిస్‌ప్లే, 20 అంగుళాల HUD, 8.88 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, 21.4 అంగుళాల రియర్ స్క్రీన్ సహా ఆరు-స్క్రీన్ కనెక్టివిటీ సిస్టమ్ ఉంది. పార్కింగ్ సహాయం కోసం 2cm రేంజింగ్ అక్యురసీ కలిగిన రియర్-ఫేసింగ్ సాలిడ్-స్టేట్ LiDARను అందించారు. సేఫ్టీ కోసం 12 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. 750mm వాటరింగ్ సామర్థ్యం, టైర్ పేలిన సమయంలో 160 కి.మీ/గంట వేగం వరకు స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
SUVలోనే క్యాంపింగ్ అనుభవం N90 Max Studio:
N90 Max Studio అనేది N90 Max ఆధారంగా రూపొందించిన ప్రత్యేక మోడల్. ఇందులో ఫ్యాక్టరీ-ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ క్యాబిన్ రూఫ్ ఉంది. రూఫ్‌ను పైకి లేపినప్పుడు వాహనం మొత్తం ఎత్తు 2,294mmకు చేరుతుంది. అదనంగా 100mm వరకు హెడ్‌రూమ్ లభించడంతో 1.8 మీటర్ల ఎత్తు ఉన్న వ్యక్తులు వెనుక భాగంలో నిలబడవచ్చు. పైభాగంలో 2,110×985mm యాక్టివిటీ ఏరియా, 1,946mm వరకు బెడ్ బోర్డ్ పొడవు ఉన్నాయి. అల్యూమినియం ఫ్రేమ్, హనీకోంబ్ ప్యానెల్స్ 200 కిలోల వరకు బరువును తట్టుకోగలవు. మూడు వైపులా ఐదు మెష్ స్క్రీన్లు, 1.7 చదరపు మీటర్ల ఫ్రంట్ విండో ఉన్నాయి.
ఇందులో AC వెంట్స్, 18W ఛార్జింగ్ పోర్ట్, మాగ్నెటిక్ మౌంట్స్, 30mm మ్యాట్రెస్, 1.7 చదరపు మీటర్ల వుడ్-గ్రెయిన్ అల్యూమినియం ఫ్లోర్, మూడు-స్థాయి ఫ్లోర్ హీటింగ్, ఏవియేషన్-గ్రేడ్ సీలింగ్ ఉన్నాయి. ఇక ఇందులోని రెండో వరుస సీట్లను కేవలం 30 సెకన్లలో 1.87×1.24 మీటర్ల బెడ్‌గా మార్చుకోవచ్చు. మ్యాట్రెస్‌ను తొలగించాల్సిన అవసరం లేదు. 40:60 స్ప్లిట్ డిజైన్ కారణంగా ఒక వైపు బెడ్‌గా ఉంచి, మరో వైపు రైల్-మౌంటెడ్ టేబుల్‌ను ఉపయోగించుకోవచ్చు.
30 అంగుళాల ప్రొజెక్షన్ సిస్టమ్, బ్లాక్‌అవుట్ కర్టెన్లు, ప్రైవసీ స్క్రీన్ మోడ్, ఫ్లోటింగ్ నైట్‌స్టాండ్, 220V, 15V పవర్ అవుట్‌లెట్లు, 20 లీటర్ల స్టోరేజ్ క్యాబినెట్, 4,000K రింగ్ లైట్‌తో 11.5 అంగుళాల వానిటీ మిర్రర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో పవర్‌ట్రెయిన్‌నే ఉపయోగించారు. ఇది 462 కి.మీ CLTC EV రేంజ్, 1,688 కి.మీ కంబైన్డ్ రేంజ్ అందిస్తుంది. 0-100 కి.మీ వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.
Xiaomi SkyNomad SUVల ధరలు:
Xiaomi SkyNomad సిరీస్ ప్రస్తుతం చైనాలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ SUVలను ఎప్పుడు ప్రవేశపెడతారనే విషయంపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదు. చైనాలో Xiaomi SkyNomad సిరీస్ ధరలు ఇలా ఉన్నాయి..
* Xiaomi N70 Pro: 2,09,900 యువాన్ — రూ.29.5 లక్షలు.
* Xiaomi N70 Max: 2,39,900 యువాన్ — రూ.33.8 లక్షలు.
* Xiaomi N90 Max: 2,69,900 యువాన్ — రూ.38 లక్షలు.
* Xiaomi N90 Max Studio: 2,99,900 యువాన్ — రూ.42.2 లక్షలు.
SUV Space. Redefined.
First look inside Xiaomi SkyNomad. A cabin that moves with your life. pic.twitter.com/CL2DWcXDQh— Xiaomi (@Xiaomi) July 10, 2026