
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్లోని ప్రగతి హాస్పిటల్లోకి డెడ్బాడీతో చొరబడిన అతడి కొడుకులు, మరికొందరు స్టాఫ్‌ను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పోచంపాడ్‌కు చెందిన ఓ వృద్ధుడిని ట్రీట్మెంట్ కోసం ఆగస్టు 30న ప్రగతి హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స అందించారు. ఆ తర్వాతి రోజు బంధువులు నగరంలోని మరో హాస్పిటల్కు షిఫ్ట్చేసి అక్కడ 6 రోజులపాటు ట్రీట్మెంట్అందించగా సోమవారం ఆ వృద్ధుడు మరణించాడు.
అయితే ప్రగతి హాస్పిటల్లో నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని ఆరోపిస్తూ అతడి కొడుకులు శ్రీకాంత్, మహిపాల్ మరికొందరు డెడ్బాడీతో వచ్చి హంగామా చేశారు. మరో హాస్పిటల్లో అయిన బిల్కట్టమని మేనేజ్మెంట్ను భయపెట్టారు. హాస్పిటల్లోకి డెడ్‌బాడీని తీసుకొచ్చి రోగుల సేవలకు ఇబ్బంది కలిగించారు. హాస్పిటల్యాజమాన్యం ఫిర్యాదుతో సీసీ కెమెరాల ఆధారంగా శ్రీకాంత్, మహిపాల్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.