Reading Time: 2 minutes

బీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు మళ్లీ అరెస్ట్.. మీడియా పాయింట్ నుంచి తాతా మధును ఎత్తుకెళ్లిన మార్షల్స్

Caption of Image.

హైదరాబాద్: శాసనమండలి మీడియా పాయింట్ దగ్గర హైడ్రామా నడిచింది. శాసన మండలి ముగిశాక మీడియా పాయింట్ దగ్గర  మాట్లాడుతున్న  బీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు హల్ చల్ చేశారు.  ఎమ్మెల్సీలు తాతామధు, నవీన్ రెడ్డిలు మీడియా తో మాట్లాతుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. వారిని అక్కడిని నుంచి ఎత్తుకొని పోలీసు వ్యాన్ లో ఎక్కించారు. సభ్యులు ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. మండలి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. 

మంగళవారం ఉదయం సభ ప్రారంభ సమయంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీలు తాతామధు, నవీన్ రెడ్డిలు ..కోర్టులో హాజరై తిరిగి మండలి చేరుకొని మీడియాతో  మాట్లాడుతుండగా మరోసారి ఇద్దరు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్ట్ చేశారు.   

ఎమ్మెల్సీ  మధుసూదనాచారి మాట్లాడుతూ.. సభను చాలా దుర్మార్గంగా నడిపించారని ఆరోపించారు. సభలో 20 మంది బీఆర్ఎస్ సభ్యుల బలం ఉండగా ఎలా  సస్పెన్షన్ పాస్ చేశారని ప్రశ్నించారు. చట్ట సభల గౌరవాన్ని దిగజార్చారని అన్నారు.ఓటింగ్ కు డిమాండ్ చేస్తే పట్టించుకోలేదన్నారు మధుసూదనచారి. ఎమ్మెల్సీలను అరెస్ట్ చేయడం దారుమన్నారు. ఎమ్మెల్సీలపట్ల మార్షల్స్ దారుణంగా ప్రవర్తించారు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని మధుసూదనచారి అరోపించారు.    

ALSO READ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

ఇదిలా ఉంటే అంతకుముందు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై తెలంగాణ శాసన మండలి సస్పెన్షన్ వేటు వేసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు.  మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఆమోదించింది. దీంతో తాతా మధు, నవీన్ రెడ్డిలను ప్రస్తుత అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ శాసన మండలి నిర్ణయం తీసుకుంది.  సస్పెన్షన్ అనంతరం తెలంగాణ శాసన మండలి సమావేశాలను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు.

అసెంబ్లీలోనూ ఏకగ్రీవంగా తీర్మానం

 స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని   తాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని  అసెంబ్లీలోనూ మంత్రి దామోదర రాజనర్సింహ తీర్మానం ప్రవేశపెట్టారు.ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.ఈ తీర్మానం కాపీని శాసన మండలి ఛైర్మన్‌కు పంపించింది. 

స్పీకర్ వ్యాఖ్యలపై వివాదం

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసెంబ్లీ, మండలిలో అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ పదవికి, శాసనసభ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అధికార పక్ష సభ్యులు అన్నారు.  ఈ నేపథ్యంలో తొలుత అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందగా.. అనంతరం అదే అంశంపై శాసన మండలిలోనూ చర్యలు తీసుకున్నారు. తాతా మధు, నవీన్ రెడ్డిలను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

©️ VIL Media Pvt Ltd.