Reading Time: < 1 minute

తమిళనాడులో అధికార కూటమికి అఫీషియల్ పేరు ఖరారు.. సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్

Caption of Image.

 తమిళనాడు అధికార కూటమికి అధికారికంగా పేరును ప్రకటించారు సీఎం విజయ్. చెన్నైలో TVK ఆఫీసులో బుధవారం జరిగిన మిత్ర పక్షాల సమావేశంలో తమిళనాడు అధికార కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’ (SSJVA) అని పేరు పెట్టారు.

కూటమిలో ప్రధాన పార్టీగా విజయ్ తమిళగవెట్రి కలగం ఉండగా,కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి.మిత్ర పక్షంలోని అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొని ఈ పేరును ఏకగ్రీవంగా ప్రకటించారు. తమిళనాడులోె అధికారంలో ఉన్న టీవీకే పార్టీ, దాని మిత్రపక్షాలు ఇప్పటివరకు అధికారికంగా పేరు లేకుండానే కొససాగింది. సెక్యూలరిజం, సామాజిక న్యాయం వంటి రాజకీయ విలువలను ప్రతిబింబించేలా సెక్యులర్ సోషల్ జస్టిస్ అలయన్స్ అని పేరు ఖరారు చేశారు కూటమినేతలు.

©️ VIL Media Pvt Ltd.