Reading Time: < 1 minute

‘మండాడి’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. బోట్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రశంసలు!

Caption of Image.

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో సుహాస్.. కోలీవుడ్‌లో తనదైన మాస్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్న సూరి కలిసి నటించిన క్రేజీ మూవీ ‘మండాడి’. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన రాగా.. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. ముఖ్యంగా యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకోవడంతో థియేటర్లలో అసలు ట్రీట్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి పెరిగింది.

అయితే లేటెస్ట్ గా ‘మండాడి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఎ సర్టిఫికెట్ అందుకుంది. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా ఉందంటూ సెన్సార్ టీమ్ ప్రశంసించడంతో మేకర్స్‌లో మరింత జోష్ పెరిగింది. ముఖ్యంగా సముద్రంలో చిత్రీకరించిన బోట్ యాక్షన్ సీక్వెన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఈ సన్నివేశాలను నిజమైన సముద్ర వాతావరణంలో చిత్రీకరించడం సినిమాకు మరింత రియలిస్టిక్ ఫీల్ తీసుకొచ్చింది.

కథిర్ సినిమాటోగ్రఫీ, జి.వి. ప్రకాష్ కుమార్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, మహేష్ మాథ్యూ రూపొందించిన యాక్షన్ బ్లాక్స్ ‘మండాడి’కి మెయిన్ హైలైట్స్‌గా నిలవనున్నాయి. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏపీ, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీగా రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు కనిపిస్తుండటంతో.. సుహాస్, సూరి కెరీర్‌లో ‘మండాడి’ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకునే మూవీగా నిలుస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 

 

©️ VIL Media Pvt Ltd.