Reading Time: 2 minutes

PoK మాది కాదా?.. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు వీడియోతో మైండ్ బ్లాక్: పాకిస్థాన్‌కు ఊహించని షాక్!

Caption of Image.

Afghanistan Promo Video PoK: భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) విడుదల చేసిన ఒక ప్రచార వీడియో అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దౌత్యపరమైన కలకలం రేపింది. ఈ ప్రచార వీడియోలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) తో పాటు గిల్గిట్-బాల్టిస్థాన్‌లను స్పష్టంగా భారతదేశ పటంలో భాగంగా చూపించడం విశేషం. ఆఫ్ఘన్ బోర్డు తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంతో పాకిస్థాన్ షాక్‌కు గురైంది. ఇరు దేశాల మధ్య కొత్త దౌత్య వివాదానికి తెరలేపిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాకిస్థాన్ తీవ్ర ఆందోళన: 

భారతదేశం మ్యాప్‌పై PoKని చూపించడం పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ దగ్గర పీసీబీ తన తీవ్ర ఆందోళనను లేవనెత్తినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో పాకిస్థాన్ సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక చర్యలు తీసుకోకపోయినప్పటికీ, అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తి ఆఫ్ఘనిస్థాన్‌పై ఒత్తిడి తేవాలని ఇస్లామాబాద్ ప్రభుత్వం యోచిస్తోంది.

పాక్‌కు తాలిబన్ల సెగ: 

ఇప్పటికే సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడుల కారణంగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ క్రికెట్ వివాదం మరింత ఆజ్యం పోసింది. పాకిస్థాన్‌లో జరుగుతున్న ఉగ్ర దాడులకు కారణమైన తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) మూకలకు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ తీవ్ర రాజకీయ ప్రతిష్టంభనల నడుమ ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు భారత మ్యాప్‌ను సరైన రీతిలో ప్రదర్శించడం పాకిస్థాన్‌కు ఇప్పుడు మింగుడుపడటం లేదు.

సెప్టెంబరు 13 నుంచి టీ20 సమరం: 

కాగా, ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య సెప్టెంబరు 13వ తేదీ నుంచి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు బలంగా ఉన్న వేళ ACB విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో భారత అభిమానులను బాగా ఆకట్టుకుంటూ పాకిస్థాన్ వర్గాల్లో మాత్రం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. 

 

©️ VIL Media Pvt Ltd.